For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో డౌన్లో కోహ్లీ: ఫలించిన ధోనీ వ్యూహం, అప్పుడే పాక్‌పై ఒత్తిడి

By Srinivas

అడిలైడ్: ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం నాడు భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహం ఫలించింది. ధోనీ వ్యూహాత్మకంగా రెండో డౌన్లో విరాట్ కోహ్లీని పంపించాడు. కోహ్లీ - శిఖర్ ధావన్‌లు ఆచితూచి ఆడుతూనే, దూకుడు కొనసాగిస్తున్నారు.

రోహిత్ శర్మ త్వరగా అవుటయ్యాడు. జట్టు స్కోరు 25 పరుగులు ఉన్నప్పుడు రోహిత్ (15) అవుటయ్యాడు. అయితే, కోహ్లీ - ధావన్లు బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ దూకుడుగా కనిపిస్తోంది. అనంతరం 163 పరుగుల వద్ద ధావన్ (73) వికెట్ కోల్పోయింది. భారత్ ముప్పై ఓవర్ల తర్వాత మరింత దూకుడు పెంచే అవకాశముంది.

300 దాటించాలి..

MS Dhoni plan: Virat Kohli in second down

అడిలైడ్ బ్యాటింగ్ పిచ్. అంతేకాకుండా, మన బౌలర్లు అంత ప్రభావం చూపే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ 330 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఫాకిస్తాన్ ముందు ఉంచితే, ప్రత్యర్థి జట్టు పైన ఒత్తిడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీని రెండో డౌన్లో దించిన ధోనీ వ్యూహం ఫలించిందని చెబుతున్నారు.

ముంబైలో అడిలైడ్ ఫీవర్

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో భారీగా బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒక్క ముంబైలోనే ముప్పై వేల కోట్ల రూపాయల మేర బెట్టింగ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వంద కోట్ల మందికి పైగా చూడనున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+