Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా రికార్డు లిఖించిన ధోనీ

MS Dhoni overtakes Gautam Gambhir to become highest-scoring captain in Indian Premier League

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో ఢిల్లీపై చెన్నై జట్టు విరుచుకుపడింది. పుణే వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ధోనీ.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదిన మహీ తన ఐపీఎల్ కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

అద్భుతమైన ఇన్నింగ్స్ కనబర్చిన చెన్నై జట్టులో షేన్ వాట్సన్ 40 బంతుల్లో (78) శుభారంభం పలికాడు. ఆఖర్లో ధోనీ (51 నాటౌట్), రాయుడు (24 బంతుల్లో 41) విధ్వంసం తోడవడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 211 పరుగులు సాధించగలిగింది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వహించిన ఆటగాడిగా రికార్డ్ నమోదు చేసిన ధోనీ.. మరో అరుదైన రికార్డ్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీపై ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకూ ఈ రికార్డ్ గంభీర్ (3518 ) పరుగులు పేరిట ఉండగా.. ధోనీ (3536) దాన్ని అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ కెప్టెన్ల జాబితాలో కోహ్లి (3333), రోహిత్ శర్మ (2198) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే ధోనీ.. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే గంభీర్, కోహ్లి, రోహిత్‌ల కంటే ముందుండటం విశేషం.

Story first published: Tuesday, May 1, 2018, 8:49 [IST]
Other articles published on May 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+