IPL 2025: సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో ధోని కోసం చెన్నై ఆడే మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ధోని బ్యాట్ పట్టుకుని స్టేడియంలోని అడుగుపెట్టే సమయంలో ధోనీ.. ధోనీ.. అంటూ ప్రేక్షకులు స్టేడియం మారుమోగేలా నినాదాలు చేస్తుంటారు. ధోని సిక్సర్లతో రెచ్చిపోతే గ్రౌండ్ మారుపోగిపోతుంది.. కానీ ఒకవేళ ఔటైతే మాత్రం స్టేడియం నిశ్శబ్ధంగా మారిపోతుంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో అదే కనిపించింది.
ధోని ఔట్.. క్యూట్ గర్ల్ రియాక్షన్
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. గౌహతిలో జరిగిన 11వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సీఎస్కేను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే గెలవడానికి చివరి ఓవర్ లో 20 పరుగులు అవసరం. ఆ సమయంలో ధోని క్రీజులో ఉన్నాడు. అలాంటి కీలక సమయంలో ధోనీ ఔట్ అయ్యాడు.సందీప్ శర్మ బౌలింగ్ లో ధోని సిక్స్ కొట్టడానికి ప్రయత్నించగా.. షిమ్రాన్ హెట్మేయర్ ఆ బంతిని క్యాచ్ పట్టడంతో ధోని ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో సీఎస్కే ఓటమి ఖాయమైంది. మ్యాచ్ లో ధోని ఔట్ అయిన వెంటనే ఓ యువతి ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె సీఎస్కే అభిమానిగా కనిపించగా.. ఆ సమయంలో ఎంఎస్ ధోనిపై కోపం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ అందమైన అమ్మాయి రియాక్షన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ యువతి కోపంతో తన వేళ్లను తప్పింది.

ఐపీఎల్ 2025 11వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సీఎస్కేకు 183 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ పరుగులను ఛేదించడానికి సీఎస్కే జట్టు తన శాయశక్తులా ప్రయత్నించింది. ఎంఎస్ ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినప్పుడు సీఎస్కే గెలవాలంటే 24 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉంది. మహీ ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ ఊహించారు. కానీ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్ లో ధోని క్యాచ్ ను షిమ్రాన్ హెట్మేయర్ అందుకున్నాడు.
ఐపీఎల్ చెన్నైకి రెండో ఓటమి
ఐపీఎల్ 2025లో సీఎస్కే జట్టు వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. సీఎస్కే తన ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది కానీ ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.