Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ధోనీ ఔట్ గొడవ..!!

IPL 2025 Dhoni: సాధారణంగా మ్యాచులో ధోనీ రివ్యూకు వెళ్లాడంటే.. కచ్చితంగా సానుకూల నిర్ణయం వస్తుందని ప్రతిఒక్కరి అభిప్రాయం. చాలా సార్లు ఇదే జరిగింది. కానీ ఈ సారి మాత్రం ధోనీ లెక్క తప్పింది. తాజాగా ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్ తో జరిగిన మ్యాచులో ధోనీ ఔటైన తీరు ఇప్పుడు వివాదస్పదంగా మారింది.

ఈ మ్యాచులో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన ధోనీ.. కేవలం 4 బంతులే ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ధోనీ ఔట్ విషయంలో ముందుగా కోల్‌కతా అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్‌ ఔట్ గా ప్రకటించాడు.

MS Dhoni Out controversy among fans in CSK VS KKR Match ipl 2025

ఫలితం మరోలా..
దీంతో వెంటనే ధోనీ రివ్యూ కోరాడు. కానీ రివ్యూలో ఫలితం మరోలా వచ్చింది. బంతి బ్యాట్‌ అంచును తాకినట్లు కాస్త 'స్పైక్స్‌' వచ్చాయి. అయితే థర్డ్ అంపైర్‌ మాత్రం 'ఔట్‌' అని ప్రకటించాడు. ఔట్ అయిన తీరును తప్పుగా చూపించడంతో విమర్శలకు దారీ తీసింది. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

వరుసగా ఐదోది..
కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచుకు ధోనీ సారథ్యం వహించినా గెలుపు మాత్రం రాలేదు. జట్టు ప్రదర్శనలో మార్పు కనపడలేదు. దీంతో సొంత గడ్డ చెపాక్‌ స్టేడియంలో మరో ఓటమిని అందుకుంది సీఎస్కే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అలవోకగా 8 వికెట్లు తేడాతో గెలుపొందింది.

Story first published: Saturday, April 12, 2025, 9:09 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+