ధోనీ-గంగూలీలలో ఎవరు బెస్ట్ అంటే యువరాజ్ షాకింగ్ జవాబు
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీలలో ఎవరు అత్యుత్తమ కెప్టెన్ అంటే.. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. యువరాజ్.. గంగూలీ, ధోనీల సారథ్యంలో ఆడాడు. యువీకి దాదా మెంటర్. ధోనీ మంచి స్నేహితుడు.

రేడియో మిర్చి నిర్వహించిన ఓ షోలో యువరాజ్ సింగ్ పాల్గొన్నాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో తన కెరీర్ ప్రారంభమైందని, అతను జట్టును ఒక తాటిపై నిలిపేవాడని, తాను ఒక్కడినే కాదని, సెహ్వాగ్, నెహ్రా, జహీర్, హర్భజన్ వంటి ఎందరినో ప్రోత్సహించాడు కాబట్టి బహుశా అతనే బెస్ట్ అని సమాధానం ఇచ్చాడు.
ధోనీతో తనకు ఎలాంటి గొడవలూ లేవని చెప్పాడు. అతను తనకు మిత్రుడేనని చెప్పాడు. కాగా, 2011 ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ తన కొడుకుకు, ఆ తర్వాత అవకాశాలు రాకుండా చేసింది ధోనీయేనని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications