Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

List of most admired man in India: ప్రధాని మోడీ తర్వాత ధోనియే

MS Dhoni only behind Prime Minister Narendra Modi in list of most admired man in India: Report

హైదరాబాద్: భారతదేశంలో అత్యంత ఆరాధించబడిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలవగా... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 41 దేశాల నుండి 42,000 మందికి పైగా పురుషులు, మహిళలతో కూడిన జాబితాను రూపొందించారు.

ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పురుషుల కేటగిరీలో బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలవగా... మహిళల జాబితాలో మాజీ అమెరికా ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా అగ్రస్థానంలో నిలిచారు. ఇక, భారత్ విషయానికి వస్తే అత్యంత ఆరాధించబడిన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలవగా... మహిళల్లో మేరీ కోమ్ అగ్రస్థానంలో నిలిచారు.

8.58 శాతం స్కోరుతో రెండో స్థానంలో ధోని

8.58 శాతం స్కోరుతో రెండో స్థానంలో ధోని

ఈ సర్వేని యుగౌవ్(YouGov) చేపట్టింది. ఇక, క్రీడాకారుల విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 8.58 శాతం స్కోరుతో రెండో స్థానంలో నిలిచారు. ప్రధాని మోడీ 15.66 శాతం స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ధోని తర్వాత సచిన్ టెండూల్కర్(5.81శాతం), విరాట్ కోహ్లీ(4.46 శాతం), క్రిస్టియానో రొనాల్డో(2.95 శాతం), లియోనల్ మెస్సీ(2.32 శాతం) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్‌గా ధోని

అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్‌గా ధోని

ఈ స్కోరు ఫ్యాన్ ఫాలోయింగ్‌ని బట్టి ఆయా క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. భారత్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఐసీసీ నిర్వహించే మూడు మేజర్ టోర్నీలను భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్న ధోని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.

టాప్-25లో మేరీ కోమ్

టాప్-25లో మేరీ కోమ్

ఇక, మహిళల కేటగిరీలో మేరీ కోమ్(10.36 శాతం)తో ఈ జాబితాలో టాప్-25లో చోటు దక్కించుకోగా... కిరణ్ బేడీ, లతా మంగేస్కర్, సుష్మా స్వరాజ్, దీపికా పదుకొణెలు టాప్-5లో ఉన్నారు.

Story first published: Wednesday, September 25, 2019, 18:37 [IST]
Other articles published on Sep 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+