Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార‌త్ వ‌ర్సెస్ పాక్: ధోనీ ముంగిట్లో అరుదైన రికార్డు

ICC Cricket World Cup 2019: IND v PAK | Dhoni Becomes 2nd Indian Player With Most ODI Appearances
MS Dhoni on verge of breaking big record for Men in Blue in ICC World Cup 2019

మాంఛెస్ట‌ర్‌: ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఆరంభం కాబోయే మ్యాచ్‌.. ఓ అరుదైన రికార్డుకు కేంద్ర బిందువు కానుంది. అదే- టీమిండియా బ్యాటింగ్ వెన్నెముక‌, మాజీ కేప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఈ రికార్డును అందుకోబోతున్నారు. ప్ర‌స్తుతం టీమిండియా మాజీ క్రికెట‌ర్ రాహుల్ ద్ర‌విడ్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఆయ‌న బ‌ద్ద‌లు కొట్ట‌బోతున్నారు. అత్య‌ధిక వ‌న్డేలు ఆడిన రికార్డు అందుకోబోతున్నారు ధోనీ.

ప్ర‌స్తుతం 340 వ‌న్డే మ్యాచ్‌ల‌ను ఆడారు ధోనీ. స‌రిగ్గా రాహుల్ ద్ర‌విడ్ కూడా 340 వ‌న్డే అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడి, రిటైర్ అయ్యారు. ప్రపంచ‌క‌ప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా ద్ర‌విడ్ రికార్డును ఎంఎస్ ధోనీ స‌మం చేశారు. పాకిస్తాన్‌తో జ‌రగ‌బోయే మ్యాచ్‌తో దీన్ని అధిగ‌మించ‌బోతున్నారు. దీనితో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వ‌న్డే అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడిన రెండో ఆట‌గాడిగా నిలుస్తాడు ధోనీ.

భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వ‌న్డే మ్యాచ్‌ల‌ను ఆడిన రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండుల్క‌ర్ పేరు మీద ఉంది. త‌న కేరీర్ మొత్తంలో స‌చిన్ టెండుల్క‌ర్ మొత్తం 461 వ‌న్డే మ్యాచ్‌ల‌ను ఆడారు. కాగా, త‌న 13 సంవ‌త్స‌రాల కేరీర్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, ఐసీసీ 50 ఓవ‌ర్ల ప్ర‌పంచ‌క‌ప్, ఛాంపియ‌న్ ట్రోఫీల‌ను సొంతం చేసుకున్న జ‌ట్టుకు కేప్టెన్‌గా ఉన్న అతి అరుదైన రికార్డు కూడా ధోనీ పేరు మీదే ఉంది.

1
43665
Story first published: Sunday, June 16, 2019, 14:55 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+