ప్రేమించొచ్చు, ద్వేషించొచ్చు, కానీ ఆయన్ను మాత్రం విస్మరించలేం: శ్రీనిపై ధోని

హైదరాబాద్: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్‌తో తనది ప్రత్యేకమైన అనుబంధమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. శ్రీనివాసన్ నుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పిన ధోని, ఆయనతో ఎక్కువ సమయం గడిపే అదృష్టం తనకు దక్కిందని చెప్పాడు.
ఇండియా సిమెంట్స్ 70 ఏళ్ల ప్రస్థానం, ఆ సంస్థతో శ్రీనివాసన్ 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని కాఫీ టేబుల్ బుక్ 'డిఫైయింగ్ ది పరాడిగమ్'ను శుక్రవారం చెన్నైలో విడదుల చేశారు. శ్రీనివాసన్‌పై రూపొందించిన ఈ పుస్తకాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి విడుదల చేయగా, తొలి కాపీని మహేంద్ర సింగ్ ధోని అందుకున్నాడు.
ధోని మాట్లాడుతూ
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ "శ్రీనివాసన్‌ను ప్రేమించొచ్చు, ద్వేషించొచ్చు, కానీ ఆయన్ను మాత్రం విస్మరించలేం. చాలా మంది ఆయన్ను ప్రేమించే వారే" అని అన్నాడు. శ్రీనివాసన్ బీసీసీఐ కోశాధికారిగా ఉన్న సమయంలో ఆయన్ను తొలిసారి కలిశానని ధోని చెప్పాడు.
నాలుగు నెలలు ఆగాల్సి వచ్చేది
అప్పటి వరకూ ఆటగాళ్లు వేతనాలు అందుకోవడానికి నాలుగు నెలలు ఆగాల్సి వచ్చేదని, కానీ శ్రీని ఆ సమస్యను పరిష్కరించారని ధోని ఈ సందర్భంగా తెలిపాడు. జీవితమంటే ఏంటో ఆయన్ను చూసే నేర్చుకున్నానని చెప్పిన ధోనీ.. ఓటములను ఎదుర్కోవడం ఎలాగో ఆయన నుంచే తెలుసుకున్నానని చెప్పాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ వదులుకోకపోవడం
ఇతరులకు సాయం చేయడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ వదులుకోకపోవడం శ్రీనివాసన్ సార్‌ను చూసి నేర్చుకున్నానని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న ధోని చెప్పుకొచ్చాడు. అయితే, శ్రీనివాసన్‌తో సాన్నిహిత్యం కారణంగా ధోనీ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మెయియప్పన్ పాత్ర తేల్చేందుకు ముద్గల్ కమిటీ మహీని ప్రశ్నించింది. అయినాసరే శ్రీనివాసన్, ధోనీ మధ్య అనుబంధం ఏమాత్రం తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘ కాలం పని చేయడం వల్ల శ్రీనివాసన్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని ధోనీ చెప్పాడు.

హాజరైన కపిల్, సెహ్వాగ్, యువీ
ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమానికి మాజీ క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్‌లతో పాటు గంభీర్, సెహ్వాగ్, శ్రీనాథ్‌లతో పాటు యువరాజ్ సింగ్ తదితర క్రికెటర్లు పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications