వరల్డ్‌కప్ 2019: కెప్టెన్‌గా కోహ్లీ వద్దు.. ధోని ముద్దు


హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు గాను వరల్డ్‌కప్ ముంగిట ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడుతోన్న చివరి వన్డే సిరిస్‌ను సెలక్టర్లు ఉపయోగించుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌లో మే30న ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో కోహ్లీకి బదులు మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు నాయకత్వం వహిస్తే బాగుంటుందని అన్నాడు. 2017లో ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు.

కోహ్లీ నాయకత్వంలో
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇటు స్వదేశంలో పాటు అటు విదేశాల్లోనూ అనేక అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లలో టెస్ట్ సిరీస్ గెలవడంలో విఫలమైనప్పటికీ.. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలిచి ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించింది.

ఒకే ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఓడిన భారత్
విరాట్ కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై టీమిండియా ఒకే ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఓడింది. క్రిక్‌బజ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అజయ్ జడేజా మాట్లాడుతూ "ధోని కెప్టెన్సీ కోహ్లీ కెప్టెన్సీ కంటే బాగుండదని ఎవరైనా అనుకుంటే వారు నాతో వాదించొచ్చు. అయితే, ఈ మార్పు కేవలం వరల్డ్‌కప్ వరకే. కెప్టెన్‌గా వ్యూహాలు రచించడంలో ధోని దిట్ట" అని అన్నాడు.

సఫారీలతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది.

వరల్డ్‌కప్ కోసం అజయ్ జడేజా ప్రకటించిన జట్టు
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), అంబటి రాయుడు, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications