For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ కీపర్‌గా పర్లేదు.. బ్యాట్స్‌మన్‌గా లాభం లేదు'

MS Dhoni no more a world-beater, tone down expectations from him as a batsman: Sanjay Manjrekar

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీతో పాటు అంతకుముందు జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సరిగా రాణించలేకపోయాడు. బ్యాట్స్‌మన్‌గా రాణించకపోయినప్పటికీ జట్టుకు సలహాలు అందించి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై విమర్శలకు దిగుతున్న వారిలో సంజయ్ మంజ్రేకర్ చేరాడు.

బ్యాట్స్‌మన్‌గా మ్యాచ్‌లను ముగించలేడని

బ్యాట్స్‌మన్‌గా మ్యాచ్‌లను ముగించలేడని

అతనిక ఎంతమాత్రమూ మ్యాచ్‌లను ముగించలేడని పేర్కొన్నారు. ఒక బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతున్నాడని తెలిపారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో మహీ ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ త్వరగానే ఔటయ్యాడు. మహీ స్థానంలో మరొకరిని సిద్ధం చేయాలని మంజ్రేకర్‌ బీసీసీఐకి సూచించారు. 2019 ప్రపంచకప్‌ నేపథ్యంలో కీపర్‌గా అతడినే కొనసాగించాలన్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చివర స్థానాల్లో వస్తే మంచిదన్నారు.

ధోనీపై అంచనాలు తగ్గించుకోవాలి

ధోనీపై అంచనాలు తగ్గించుకోవాలి

‘ఆసియాకప్‌ ఫైనల్లో ధోనీ కన్నా ముందు కేదార్‌ జాదవ్‌ రావాల్సింది. అతడు ఫామ్‌లో ఉన్నాడు. పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌. ఇక ధోనీపై అభిమానులు అంచనాలు తగ్గించుకోవాలి. అతనో అద్భుత వికెట్‌ కీపర్‌. వేగంగా స్టంపింగ్‌ చేస్తాడు. అతనిలాంటి అనుభవం ఉన్న వ్యక్తి విరాట్‌ కోహ్లీకి అవసరం. అతడి బ్యాటింగ్‌ మాత్రం సమస్యగా మారింది. ధోనీ కన్నా మెరుగైన అవకాశం ఉంటే ప్రత్యామ్నాయం వైపు ప్రయత్నించవచ్చు' అని మంజ్రేకర్‌ పేర్కొన్నారు.

 మునుపటి వేగం కనిపించడం లేదని

మునుపటి వేగం కనిపించడం లేదని

ధోనీ ఆటతీరు పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం పెదవి విరిచాడు. ఇటీవల మ్యాచ్‌లలో ధోనీ బ్యాటింగ్ ప్రదర్శనపై గవాస్కర్ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌లో మునుపటి వేగం కనిపించడం లేదని తెలిపాడు. ధోని దేశవాళీ క్రికెట్‌ ఆడితే మునపటి ఫామ్‌ను అందుకోవచ్చని విశ్వాసం వ్యక్తం వేశారు.

ఆటలో మునపటి రిథమ్‌

ఆటలో మునపటి రిథమ్‌

ధోని కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. నాలుగు రోజుల గేమ్స్‌ ఆడాలి. 50 ఓవరల్లో అంతగా అవకాశాలుండవు. నాలుగు రోజుల ఆట వల్ల సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌ ఆడొచ్చు. దానివల్ల ఆటలో మునపటి రిథమ్‌ వస్తుంది. అలాగే ఝార్ఖండ్ నుంచి కొత్తగా క్రికెట్లోకి వచ్చే ఆటగాళ్లకు ధోని ఉపయోగడతాడు' అని సన్నీ అన్నారు.

Story first published: Monday, October 1, 2018, 19:49 [IST]
Other articles published on Oct 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+