త్వరలోనే 'ఎంఎస్ ధోనీ సాంగ్ నం7'.. హెలికాఫ్టర్ డ్యాన్స్ కూడా!!

ఆంటిగ్వా: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పాటను అంకితమిచ్చేందుకు ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సిద్ధమయ్యాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోనీ సాంగ్ నం7' పేరిట బ్రావో ఈ పాటను రూపొందిస్తున్నాడు. ధోనీ పుట్టినరోజును పురస్కరించుకొని జులై 7న పాటను విడుదల చేసేందుకు సిద్ధమైనట్టు బ్రావో బుధవారం ప్రకటించాడు.

కమింగ్ సూన్:
మహీ పాటకు సంబంధించి చిన్న వీడియో పంచుకున్న డ్వేన్ బ్రావో.. ధోనీ పుట్టినరోజున ఆ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్టు చెప్పాడు. 'ధోనీ అభిమానుల కోరిక మేరకు అతడి జన్మదినం సందర్భంగా ఈ పాట విడుదల చేస్తున్నా. ఈ విషయంపై స్పష్టత ఇచ్చేందుకే ఈ పోస్టు చేశా. అలాగే మనం కొత్త డ్యాన్స్ చేద్దాం. దానికి 'హెలికాఫ్టర్ డ్యాన్స్' అని పేరు పెడదాం. మీరు చేసిన డ్యాన్స్ వీడియోకు నన్ను ట్యాగ్ చేయండి. దానిలో బాగున్నదాన్ని ఎంపిక చేసి ధోనీ అధికారిక డ్యాన్స్‌గా గుర్తిస్తా' అని బ్రావో రాసుకొచ్చాడు

మరింత శ్రద్ధతో పాట:
ఎంఎస్ ధోనీ నంబర్ 7 అంటూ సాగే ఈ పాట మహీ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తున్నది. గాయకుడిగా ఇప్పటికే చాలాసార్లు అలరించిన డ్వేన్ బ్రావో తనకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మరింత శ్రద్ధతో పాటను రూపొందిస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న బ్రావో మొత్తం దృష్టి ఈ పాటపైనే పెట్టాడట. బ్రావో వెస్టిండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టీ20లు ఆడాడు.

ధోనీ కోసం ఏదైనా కొత్తగా చేయాలి:
బ్రావో గతంలో ఓసారి మాట్లాడుతూ ధోనీ కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఉందన్నాడు. మహీ ఎంతో మంది ఆటగాళ్లకు అవకాశాలిచ్చాడని, అందుకే అతడిపై ఓ పాట రాస్తున్నానన్నాడు. ఇలా ఏ క్రీడాకారుడిపైనా ఎవరూ పాటతో తమ అభిమానాన్ని చాటలేదని, తానే కొత్త ఆలోచనలతో వచ్చానని తెలిపాడు. 'ధోనీ కెరీర్ తుది ఘట్టానికి చేరింది. అతడి కోసం ఏదైనా చేయాలని అనిపించింది. అతడి కెరీర్ మొత్తం అద్భుతంగా సాగింది. నా వ్యక్తిగత కెరీర్‌పైనా చాలా ప్రభావం చూపాడు. అలాగే ఎంతో మంది ఆటగాళ్లకు వెన్నుదన్నుగా నిలిచాడు. దేశం కూడా గర్వపడేలా కప్పులు సాధించాడు. అందుకే అతడి కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఈ పాట రాస్తున్నా' అని బ్రావో వివరించాడు.

104 మ్యాచుల్లో 121 వికెట్లు:
2011 నుంచి సీఎస్‌కే తరఫున ఆడిన బ్రావో.. 104 మ్యాచుల్లో 121 వికెట్లు తీశాడు. అంతేకాక 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్'ని కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఏడాది తర్వాత బ్రేవో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. బ్రేవో 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012, 2016ల్లో విండీస్ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు. విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేసి రిటైర్మెంట్ ఇచ్చాడు.
లాక్‌డౌన్‌లో బిజీబిజీ.. గుర్రపు స్వారీ.. ట్రాక్టర్ డ్రైవింగ్!!
View this post on InstagramA post shared by Dwayne Bravo Aka Mr. Champion🏆 (@djbravo47) on
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications