Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధనాధన్ ధోనీకి అభిమాన టెన్నిస్ ప్లేయర్

MS Dhoni names his favourite Tennis player

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ అభిమాన టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్. ఈ మధ్యనే ధోనీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను ఇలా బయటపెట్టాడు. కేవలం అతని ఆటతీరునే కాదు ఆటిట్యూడ్‌ని కూడా ఇష్టపడుతున్నాడు ధోనీ. రోజర్ ఫెదరర్‌కి నాదల్ అంటే భలే భయం. ఎందుకంటే నాదల్ ఆట చివరి వరకు పోరాడుతూనే ఉంటాడు.

రోజర్ ఫెదరర్ అంటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కి వీరాభిమానం. స్విస్‌ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ రోజర్‌ ఫెదరర్‌. ఫెదరర్‌ ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా సచిన్‌ అక్కడికి వెళ్లిపోతూ ఉంటాడు. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీకైతే సచిన్‌ తప్పనిసరిగా హాజరైపోతుంటాడు.

నాదల్‌ ఆటను ధోనీ నేరుగా చూడకపోయినా ఎన్నో ఏళ్ల నుంచి అతన్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. కోర్టులో గెలుపు కోసం నాదల్‌ పోరాట ప్రదర్శన ధోనీకి ఎంతో ఇష్టమట.

ఇతరుల కంటే మెరుగైన ప్రదర్శన చేయాలన్నది లక్ష్యం కాదు. ప్రదర్శన ద్వారా ఎన్ని విజయాల దక్కాయన్నదే ముఖ్యం అనే సిద్ధాంతాన్ని ఇద్దరూ ఫాలో అవుతుంటారట. అందుకే వారు తమ తమ క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగారు. దేశానికి మరుపురాని విజయాలను అందించారు.

శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లు ముగియడంతో ధోనీకి కావాల్సినంత విరామం దొరికింది. టెస్టు సిరీస్‌ కోసం కోహ్లీ సేన ఈ రోజు దక్షిణాఫ్రికా వెళ్లనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1న తొలి వన్డే జరగనుంది. ఆ సమయానికి ధోనీ అక్కడికి చేరుకుంటాడు. మొదటి మ్యాచ్ జనవరి 5నుంచి న్యూలాండ్ వేదికగా జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 15:41 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+