న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా! ధోనీకి అరుదైన గౌరవం

 MS Dhoni named captain of Cricket Australia ODI team of the decade, Virat Kohli Test skipper

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ధోనితో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు లభించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన వన్డే జట్టులో కేవలం ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్‌కు మాత్రమే చోటు దక్కింది. ఆసీస్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌కు మాత్రం క్రికెట్‌ ఆస్ట్రేలియా చోటిచ్చింది. క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీమ్‌ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌లు ఉన్నారు.

పీసీబీ ఛైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు.. పాకిస్థాన్‌ కన్నా భారతే చాలా ప్రమాదకరం!!పీసీబీ ఛైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు.. పాకిస్థాన్‌ కన్నా భారతే చాలా ప్రమాదకరం!!

ఇంగ్లాండ్‌ నుంచి జోస్‌ బట్లర్‌కు మాత్రమే

ఇంగ్లాండ్‌ నుంచి జోస్‌ బట్లర్‌కు మాత్రమే

బంగ్లాదేశ్‌ నుంచి షకీబ్ ఉల్‌ హసన్‌ ఉండగా, ఇంగ్లాండ్‌ నుంచి జోస్‌ బట్లర్‌కు మాత్రమే చోటు దక్కింది. ఇక, భారత్ నుంచి ధోనితో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌ నుంచి ట్రెంట్‌ బౌల్ట్‌, అఫ్గానిస్తాన్‌ నుంచి రషీద్‌ ఖాన్‌లు న్నారు. శ్రీలంక నుంచి లసిత్‌ మలింగా చోటు దక్కించుకున్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే జట్టు

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే జట్టు

మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్‌-వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, జోస్‌ బట్లర్‌, రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగ

టెస్టు జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

టెస్టు జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలను లోతుగా పరిశీలించి ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టుని ఎంపిక చేసింది. ఈ జట్టులో భారతదేశం నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంచుకోవడం విశేషం.

క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దపు టెస్టు జట్టు

క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దపు టెస్టు జట్టు

అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ (కెప్టన్), ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లియోన్, జేమ్స్ ఆండర్సన్

Story first published: Tuesday, December 24, 2019, 12:13 [IST]
Other articles published on Dec 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X