Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్ట్ మిస్: 15 పరుగుల దూరంలో ఆగిపోయిన ధోని

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శనివారం ఐదో వన్డేలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

ఈ మ్యాచ్‌కు ముందు స్వదేశంలో వన్డేల్లో నాలుగు వేల పరుగులు చేరుకునేందుకు గాను 56 పరుగుల దూరంలో నిలిచిన ధోని, ఆ ఘనతను అందుకునే క్రమంలో ఔటయ్యాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ధోని 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు.

MS Dhoni misses 15 runs away for Sachin Tendulkar in rare club

జట్టు స్కోరు 190 పరుగుల వద్ద 38వ ఓవర్ మూడో బంతికి సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 59 బంతులు ఎదుర్కొన్న ధోని 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు. కోహ్లీ అర్ధ సెంచరీ చేసిన తర్వాత బంతికే ధోని ఔటయ్యాడు. [విశాఖలో పైనల్ ఫైట్: కోహ్లీ అర్ధ సెంచరీ, ధోని ఔట్]

అలా కాకుండా ఈ మ్యాచ్‌లో ధోని మరో 15 పరుగులు చేసి ఉంటే, స్వదేశంలో వన్డేల్లో నాలుగు వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. కాగా, సచిన్ టెండూల్కర్ 6976 పరుగులతో స్వదేశంలో ఎక్కువ వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటిస్ధానంలో ఉన్నాడు.

ఇంకో విశేషమేమిటంటే ఈ మ్యాచ్‌తో 199 వన్డేలకి కెప్టెన్సీ వహించిన అరుదైన ఘనతను ధోనీ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఇంకో సిక్స్ బాది భారత్‌ తరఫున వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు (196) రికార్డుని మరింత మెరుగుపర్చుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+