ఎంసీసీ గైడ్ లైన్స్: ధోని ఇక బ్యాట్ మార్చక తప్పదు
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త బ్యాట్ తయారు చేయించుకునే పనిలో పడ్డాడు. మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎమ్‌సీసీ) సూచించిన నిబంధనల మేరకు ధోనీ తన బ్యాట్ సైజులో కొద్దిపాటి మార్పులు చేయనున్నాడు.
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెటర్ల బ్యాటు అంచుల మందం 40 మిల్లీమీటర్లలోపు ఉండాలి. ధోనీ ఇప్పటి వరకు 45 మిల్లీమీటర్ల మందం ఉన్న బ్యాట్‌ను వాడుతూ వచ్చాడు. ఎమ్‌సీసీ సూచించిన కొత్త నిబంధనలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

బ్యాట్ సైజుని మార్పించుకునే పనిలో ధోని
ఈ నేపథ్యంలో ధోని తన బ్యాట్ సైజుని మార్పించుకునే పనిలో పడ్డాడు. ధోనీతో పాటు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ కూడా తమ బ్యాట్లను మార్చుకోవాల్సి ఉంది. నిజానికి భారత జట్టులోని సహచర ఆటగాళ్ల బ్యాట్ బరువుతో పోలిస్తే ధోనీ బ్యాట్ బరువు కాస్త ఎక్కువే. 1250 గ్రాముల నుంచి 1300గ్రాముల మధ్య ధోనీ బ్యాట్ బరువు ఉంటుంది.

ధోని బ్యాట్ బరువు తగ్గే అవకాశం
తాజా నిబంధనలతో ధోని బ్యాట్ సైజులో మార్పులు చేపట్టడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధావన్, యువరాజ్, కేఎల్ రాహుల్, పుజారా, రిషబ్ పంత్ తదితరులు వాడే బ్యాట్ బరువు 1160 నుంచి 1180గ్రాముల మధ్య ఉంది.

ఇప్పటికే బ్యాట్ సైజులో మార్పులు చోటు చేసుకున్న పొలార్డ్
వెస్టిండిస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఇప్పటికే మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎమ్‌సీసీ) సూచించిన నిబంధనల మేరకు తన బ్యాట్ సైజులో మార్పులు చేశాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో పొలార్డ్ మార్పులు చేసిన బ్యాట్‌తోనే ఆడాడు. త్వరలో కోహ్లీసేన టీమిండియా శ్రీలంక పర్యనటకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

జులై 26న గాలేలో తొలి టెస్టు
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ 20 ఆడనుంది. ఇరు జట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు జులై 26న ప్రారంభంకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications