For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని కిస్ చేసిన అభిమాని.. సంబరపడిపోయిన మహీ (వీడియో)!!

MS Dhoni met his little fan in Chennai after practice session with CSK camp at Chepauk
IPL 2020 : MS Dhoni Meets His Little Fan After Practice Session | Oneindia Telugu

చెన్నై: ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) సీజన్-13 మొదలవనున్న విషయం తెలిసిందే. అయితే నెల ముందు నుంచే చెన్నై క్రికెట్ అభిమానులకు ఐపీఎల్‌ ఫీవర్‌ పట్టుకుంది. అందుకు కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టడమే. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ మర్చి 2 నుండి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఎంఏ చిదంబరం స్టేడియంలో మహీ ప్రతి రోజు ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

మైదానంకు భారీ సంఖ్యలో అభిమానులు:

మైదానంకు భారీ సంఖ్యలో అభిమానులు:

ఎంఎస్ ధోనీకి భారత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ కెప్టెన్ క్రికెట్‌కు దూరమై దాదాపు 8 నెలలు కావొస్తుండడంతో.. అతడి పునరాగమనం కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహీ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు మైదానంకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చెన్నై కెప్టెన్ బ్యాటు పట్టి సాధన చేస్తున్న సమయంలో 'ధోనీ..ధోనీ.. ధోనీ.. ధోనీ' అంటూ ఫాన్స్ నినాదాలు చేస్తున్నారు. తన హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ధోనీ కూడా అలరిస్తున్నాడు.

ధోనీకి అభిమాని కిస్:

తాజాగా ధోనీ ప్రాక్టీస్ ముగించుకుని వెళుతుండగా.. భారీ సంఖ్యలో అభిమానులు అతని వద్దకు చేరుకున్నారు. ఓ చిన్నారి కూడా మహీని చూసేందుకు వచ్చింది. ఆ చిన్నారిని చూసిన ధోనీ.. అక్కడే ఆగి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆపై హైఫై కొట్టాడు. అనంతరం చిన్నారి ఫ్యాన్ మాహీకి కిస్ ఇవ్వగా.. ఎంతో సంబరపడిపోయాడు. తర్వాత తన కోసం వచ్చిన అభిమానులకు కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 పొరుగు దేశంలో కూడా:

పొరుగు దేశంలో కూడా:

మరోవైపు ధోనీపై అభిమానం దేశం దాటి పొరుగు దేశానికి చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లోనూ మహీకి అభిమానులున్నారు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఐదో సీజన్‌ జరుగుతుండగా ఇస్లామాబాద్‌ యునైటెడ్‌.. ముల్తాన్‌ సుల్తాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఓ ఇస్లామాబాద్‌ అభిమాని పాకిస్థాన్‌ జట్టు జెర్సీని ధరించాడు. దానిపై ధోనీ పేరుతో సహా అతడి నంబర్‌ 7 ఉండటం విశేషం. మ్యాచ్‌ జరుగుతుండగా అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

 నిరూపించుకోవాల్సిందే:

నిరూపించుకోవాల్సిందే:

జాతీయ జట్టులో ధోనీ పునరాగమనం చేయాలంటే ఐపీఎల్‌లో రాణించాల్సిందేనని నూతన సెలెక్షన్‌ కమిటీ కూడా స్థిరమైన అభిప్రాయంతోనే ఉన్నట్టు బోర్డు వర్గాల సమాచారం. సునిల్ జోషితో పాటు మరో నూతన సెలెక్టర్‌ హర్విందర్‌ సింగ్‌తో కలిసి కొత్త సెలెక్షన్‌ కమిటీ ఆదివారం సమావేశమైంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపిక చేయగా.. ఎప్పటిలాగే ధోనీ పేరును ఇందులో చర్చించలేదు.

Story first published: Tuesday, March 10, 2020, 15:50 [IST]
Other articles published on Mar 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+