
హైదరాబాద్: క్రికెట్‌లో మిస్టర్ కూల్‌గా చెప్పుకునే ధోనీ.. మిస్టర్ ఫన్నీ కూడా అయ్యాడు. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ మంజ్రేకర్‌ను ఆటపట్టించాడు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో కామెంటేటర్‌గా ఉన్న మంజ్రేకర్‌ను ఆట పట్టించాడు. ఫైనల్ మ్యాచ్ అంటే కెప్టెన్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లకు ఎంతో కొంత ఆందోళన ఉంటుంది.
కానీ, ధోనీ ఇందుకు పూర్తి విరుద్ధం. టాస్ వేసేందుకు ధోనీ, విలియమ్సన్ మైదానంలోకి వచ్చారు. సంజయ్ మంజ్రేకర్ కామెంటేటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ధోనీ కాయిన్ ఎగురవేసి..హెడ్స్‌ను ఎంచుకున్నాడు. మంజ్రేకర్ హెడ్స్‌ను కోరుకుంది ఎవరు అని అడగ్గా ధోనీ... విలియమ్సన్‌ను చూపిస్తూ తను టైల్స్‌ను కోరుకున్నాడు అని అన్నాడు.
కాస్త తికమకకు గురైన మంజ్రేకర్ ఔను, నువ్వు హెడ్స్ కోరుకున్నావు కదూ అని ధోనీని అన్నాడు. అప్పుడు మరోసారి ధోనీ.. విలియమ్సన్‌ను చూపిస్తూ తాను టైల్స్ కోరుకున్నాడు అనడంతో అందరూ నవ్వేశారు. అనంతరం మంజ్రేకర్ 'ఏం జరుగుతుంది. ఓకే. నువ్వు టాస్ గెలిచావు' అని ధోనీతో అన్నాడు. అప్పుడు అవును టాస్ గెలిచాను అని మళ్లీ అదే చెప్తుండటంతో ఇంతకీ నువ్వేది ఎంచుకుంటావు. అని అడిగిన ప్రశ్నతో ఆ సన్నివేశానికి ముడిపడింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫైనల్లో చెన్నై విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లోనూ షేన్ వాట్సన్ అద్భుతమైన ప్రదర్శన చేసి అదరగొట్టాడు. బౌండరీల వర్షం కురిపించి హైదరాబాద్ జట్టును బెంబేలెత్తించాడు.