Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni Meets Fangirl: ఎంఎస్ ధోనీ ఔదార్యం.. దివ్యాంగురాలైన తన ఫ్యాన్‌ను కలిసి కన్నీళ్లు తుడిచాడు

Ms Dhoni meets specially Challenged Fan Girl at Ranchi Airport, and make her Happy

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన అభిమానులను కలిసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే మరోసారి ధోనీ తన అభిమానిని సర్ ప్రైజ్ చేశాడు. ప్రత్యేక ప్రతిభావంతుడైన ఓ అభిమానిని ధోనీ కలిసి ముచ్చటించాడు. ఈ వీడియో వైరలైంది. ఇటీవలే ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన 40ఏళ్ల ధోనీ.. మునుపటి ధోనీని చూపించాడు. తనలో ఇంకా ఫినిషర్ ఉన్నాడని చాటాడు. భారత క్రికెట్‌లో అత్యంత పేరుప్రఖ్యాతులున్న క్రికెటర్ ధోనీ. అతనికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు.

అతను టీమిండియాకు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అందించిన సేవలు ఎనలేనివి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినాక.. ధోనీ సైనిక శిక్షణలో చాలా చురుకుగా ఉన్నాడు. చాలాసార్లు క్యాంపులకు కూడా వెళ్లాడు. ఇకపోతే అతను రాంచీ విమానాశ్రయంలో ఉన్న టైంలో లావణ్య అనే ప్రత్యేక ప్రతిభావంతురాలిని కలిశాడు.

ఇకపోతే ధోనీని కలిసిన ప్రత్యేక క్షణాన్ని లావణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతో ప్రేమతో, చాలా మనస్ఫూర్తిగా తనతో మాట్లాడాడని ఆమె పేర్కొంది. ఇకపోతే ధోని తన కన్నీళ్లు తుడిచాడని, తనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడని మురిసిపోయింది. తను వేసిన స్కెచ్ పెయింటింగ్‌కు ధోనీ ధన్యవాదాలు తెలపడాన్ని ఆమె ప్రస్తావించింది. కెప్టెన్ కూల్ ఎంఎస్డీ పట్ల ఆమె తన ప్రేమాభిమానాలు చాటుకుంది. .



ఇక ధోనీతో కలిసిన విషయమై లావణ్య పేర్కొంటూ 'ధోనీని కలిసిన అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. చాలా ఫ్రెండ్లీగా, ప్రేమగా మాట్లాడాడు. నా పేరు స్పెల్లింగ్ చెప్పాలని నన్ను అడిగాడు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. "రోనా నహీ" ఏడవొద్దు సరేనా అని బుజ్జగిస్తూ నా కన్నీటిని తుడిచాడు. నాకు చాలా ఆనందమేసింది. అతను నేను వేసిన స్కెచ్ పెయింటింగ్‌ను మెచ్చుకున్నాడు. నాకు థాంక్యూ కూడా చెప్పాడు. ధోనీ నాతో మాట్లాడిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ రోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని పేర్కొంది.
Story first published: Wednesday, June 1, 2022, 9:41 [IST]
Other articles published on Jun 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+