Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దివ్యాంగుడైన అభిమాని కోరిక తీర్చిన ధోనీ (వీడియో)

India Vs West Indies 2018 : MS Dhoni And Virat Kohli Meet A Handicapped Fan Before 5th ODI| Oneindia
MS Dhoni meet a handicapped fan before fifth ODI

హైదరాబాద్: క్రికెటర్లను చేరుకోవాలని వాళ్లతో ఫొటో దిగాలని ఎందరో కోరుకుంటారు. దాని కోసం ఎంత చేయడానికైనా వెనుకాడరు. మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో నుంచి పరుగెత్తికెళ్లి వాళ్లను కలిసిన సందర్భాలు కోకొల్లలు. కానీ, వికలాంగుడు నడవలేని అభిమాని.. వీల్ ఛైర్‌కే పరిమితమైన అభిమాని తన స్టార్ క్రికెటర్‌ని ఎలా కలుసుకుంటాడు. కానీ, అది సాధ్యపడింది. వెస్టిండీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్ నేపథ్యంలో ఐదో వన్డే ఆడేందుకు టీమిండియా తిరువనంతపురం చేరుకుంది.

అభిమాని కోసం ధోనీ, కోహ్లీ:

అభిమాని కోసం ధోనీ, కోహ్లీ:

అభిమానుల పట్ల ప్రత్యేక ఆదరణ చూపించే ధోనీ అంటే ఓ చిన్నారికి ధోనీని కలవాలనే ఆరాటంతో టీమిండియా బస చేస్తున్న హోటల్ ముందు ఎదురుచూస్తున్నాడు. అది గమనించిన ధోనీ, కోహ్లీ అతని వద్దకు వెళ్లి కలిశారు.

చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా

ధోనీ ప్రత్యేకంగా అభిమాని కోసం ఆటోగ్రాఫ్‌ను ఇచ్చి.,. కలిసి ఫొటో దిగాడు. దాంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అక్కడే ఉన్న వారు ఫోన్‌ల ద్వారా వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

హోటల్ సిబ్బంది కోసం ఉచితంగా టిక్కెట్లను

హోటల్ సిబ్బంది కోసం ఉచితంగా టిక్కెట్లను

అంతేకాకుండా మహీ.. హోటల్ సిబ్బంది చూపించిన ఆదరాభిమానాలకు మెచ్చి స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వారి కోసం టిక్కెట్లను ఉచితంగా ఇప్పించాడు. గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా టీమిండియా ఐదో వన్డే ఆడేందుకు సిద్ధమైంది. మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ గెలిచినట్లు.. లేదా టైగా ముగిసిపోతుంది. ఈ క్రమంలో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఓడించేందుకు చక్కటి వ్యూహాలతో సిద్ధమవుతోంది.

ధోనీ పరిమిత ఓవర్లకు స్వస్తి చెప్పేశాడంటూ

ధోనీ పరిమిత ఓవర్లకు స్వస్తి చెప్పేశాడంటూ

ఈ ఏడాది ధోనీకి వన్డే సిరీస్‌లలో ఇదే ఆఖరి మ్యాచ్. ఈ సిరీస్ అనంతరం వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లోనూ టీమిండియా తరపున ధోనీ జట్టులోకి ఎంపిక కాలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతని పేరు కనిపించకపోవడంతో.. ఇక ధోనీ పరిమిత ఓవర్లకు స్వస్తి చెప్పేశాడంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.

Story first published: Thursday, November 1, 2018, 16:55 [IST]
Other articles published on Nov 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+