ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీ.. 2020లోనే అంతర్జాతీయ పునరాగమనం?

హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీకి స్థానం లభించింది. ఆసియా ఎలెవన్ జట్టులో పాల్గొనడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుండి అనుమతి కోరింది. అయితే బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంది.

ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీ
ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీ ఆడునున్నట్టు బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. 'బంగ్లాదేశ్ బోర్డు రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఆసియా ఎలెవన్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగే ఈ రెండు టీ20ల కోసం బీసీసీఐ, ఆసియా ప్రాంతంలోని ఇతర క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం' అని నిజాముద్దీన్ తెలిపారు.

ఐసీసీ హోదా
ఆసియా ఎలెవన్ జట్టులో ఆడితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ కంటే ముందే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్, ఆసియా ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు మార్చి 18, 21 తేదీలలో జరగనున్నాయి. ఈ రెండు రెండు టీ20లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్‌ల హోదాను పొందాయి.

టీమిండియా నుండి 7 మంది
ఎంఎస్ ధోనీతో పాటు టీమిండియా నుండి మొత్తం 7 మంది ఆసియా ఎలెవన్ జట్టులో ఆడనున్నారని సమాచారం తెలుస్తోంది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలు ఆడనున్నారు. ఐపీఎల్-13 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ నాయకత్వం వహించనున్నాడు.

క్రికెట్‌కు తాత్కాలిక విరామం
చివరిసారిగా ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆడిన ధోనీ మైదానంలోకి దిగి దాదాపు ఐదు నెలలు అవుతోంది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా రెండు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనే స్పష్టత లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications