రవిశాస్త్రి 'వన్డే రిటైర్మెంట్' వ్యాఖ్యల వెనుక ధోని మనసులో ఏముందో?

హైదరాబాద్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇకపై వన్డేలు ఆడకపోవచ్చని త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి గురువారం ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
గురువారం రవిశాస్త్రి మాట్లాడుతూ "మహీతో నేను ఏకాంతంగా మాట్లాడాను. ఏం మాట్లాడామన్నది మా ఇద్దరి మధ్యే ఉంటుంది. అతడు టెస్టు కెరీర్‌ను ముగించాడు. బహుశా త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడు" అని అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ తర్వాత ధోని మళ్లీ బ్యాట్ పట్టలేదు.

రిటైర్‌మెంట్ వార్తలపై
తన రిటైర్‌మెంట్‌పై వార్తలు వచ్చినప్పటికీ పెదవి విప్పలేదు. రెండు నెలలు క్రికెట్‌కు విరామం ప్రకటించి దేశ సేవకు అంకితమయ్యాడు. ఆ తర్వాత కూడా బ్యాట్ పట్టి బరిలోకి దిగలేదు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన ధోని.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ప్రస్తుతం లంకతో జరుగుతున్న... తర్వాత జరగబోయే ఆసీస్ సిరిస్‌కు దూరమయ్యాడు.

దేశవాళీ క్రికెట్లో కూడా
దేశవాళీ క్రికెట్లో కూడా ఆడటం లేదు. అయితే అనూహ్యంగా హెడ్ కోచ్ రవిశాస్త్రి సందర్భం కాని సమయంలో ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చి ధోని వన్డేలకు మాత్రమే వీడ్కోలు పలుకుతాడని చెప్పడంతో ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్ టీ20 ప్రపంచకప్ రేసులో ధోని ఉండాడని హింట్ ఇచ్చినట్లు అయింది.

ధోని స్థానాన్ని భర్తీ చేద్దామని
ధోని స్థానాన్ని భర్తీ చేద్దామని జాతీయ జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంకా నిలకడ సాధించకపోవడంతో టీ20 వరల్డ్‌కప్‌లో ధోని ఉండాని జట్టు మేనేజ్‌మెంట్ భావించి ఉండొచ్చు. అంతేకాదు ఐపీఎల్‌లో ధోని సత్తా చాటితే వరల్డ్‌కప్ ఎంపికలో కూడా అతడిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారిస్తోన్న ధోని మెరుపులు మెరిపిస్తే టీ20 వరల్డ్‌కప్‌లో అతడి ఎంపిక ఖాయం. ప్రస్తుతం ధోని వయసు 38. ఫిట్‌నెస్ పరంగా అతడికి ఎలాంటి సమస్యలు లేవు. భారత జట్టులో అత్యుత్తమ వికెట్‌కీపర్ అతడే.

ధోని ఫామ్ అందుకుంటే!
దీనిని బట్టి చూస్తుంటే ఐపీఎల్‌లో ధోని ఫామ్ అందుకుని ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అనుకుంటున్నాడేమో? ధోని మనసులో కూడా ఇదే ఉందేమో? అందుకే ధోని వన్డేలకు మాత్రమే వీడ్కోలు పలుకుతాడని కోచ్ రవిశాస్త్రి చేత చెప్పించినట్లు ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications