న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ టూర్‌కు ధోనీ దూరం.. పంత్‌కు అవకాశం!!

MS Dhoni Makes Himself Unavailable For West Indies Tour || Oneindia Telugu
MS Dhoni makes himself unavailable for West Indies tour, veteran cricketer no more first-choice wicketkeeper

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు ఊపందుకున్నాయి. స్లో బ్యాటింగ్, కీపింగ్ తప్పిదాలు గత ప్రపంచకప్‌లో చూసాం. దీంతో రిటైర్మెంట్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ప్రపంచకప్‌ అనంతరం ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా భారత్ సెమీస్ నుండి నిష్క్రమించినా.. రిటైర్మెంట్‌పై ధోనీ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

వెస్టీండీస్ టూర్‌కు దూరం:

వెస్టీండీస్ టూర్‌కు దూరం:

ధోనీ రిటైర్మెంట్‌పై మాకు ఎలాంటి సమాచారం లేదు. ధోనీ కూడా మాకు ఏమీ చెప్పలేదు అని సెమీస్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే ఆగస్ట్‌లో వెస్టీండీస్ టూర్‌కు టీమిండియా వెళ్లనుంది. ఈ మ్యాచ్‌లకు ధోనీ గైర్హాజరవుతున్నట్లు బీసీసీఐ వర్గాల నుండి సమాచారం అందుతోంది. వికెట్ కీపర్‌గా ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ధోనీ స్థానంలో పంత్‌:

ధోనీ స్థానంలో పంత్‌:

'ధోనీ వెస్టిండీస్‌కు వెళ్లరు. అతను ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా భారతదేశంలో లేదా విదేశాలలో జట్టుతో ప్రయాణించడు. వికెట్ కీపర్‌గా ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపికచేస్తాం. ధోనీ వెస్టిండీస్‌ వెళ్లినా జట్టులోని 15 మంది సభ్యుల్లో ఒకడిగా వెళుతారు. కానీ మైదానంలో ఆడే 11 మందిలో ఉండరు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ధోనీ సూచనలు అవసరం:

ధోనీ సూచనలు అవసరం:

'జట్టులో పంత్‌ కుదురుకునే వరకు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ధోనీ సూచనలు అతని అవసరం. ధోనీ జట్టులో ఉండి అతనికి మార్గదర్శిగా వ్యవహరిస్తారు. ప్రస్తుత జట్టుకు ధోనీ మార్గదర్శకత్వం చాలా విషయాల్లో అవసరముంది. ధోనీ లాంటి మార్గదర్శకుడు జట్టుకు దూరం కావడం అనారోగ్యకర పరిణామామని' బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 19న జట్టును ప్రకటించే అవకాశముంది.

Story first published: Wednesday, July 17, 2019, 14:45 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X