Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డీఆర్ఎస్: నాగ్‌పూర్ వన్డేలో ధోని లెక్క తప్పింది

హైదరాబాద్: డీఆర్‌ఎస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంత కచ్చితంగా ఉంటాడో మనందరికి తెలిసిందే. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత కూడా రివ్యూ కోరాలా వద్దా అన్న విషయంలో ధోనీయే కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులైతే డీఆర్‌ఎస్‌ను ధోని రివ్యూ సిస్టమ్‌గా పిలుస్తున్నారు.

అయితే డీఆర్ఎస్‌లో ఈసారి మాత్రం ధోని లెక్క తప్పింది. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన చివరి వన్డేలో ధోని మాటవిని డీఆర్‌ఎస్‌కు వెళ్లిన కెప్టెన్ కోహ్లీకి పెద్ద షాకే తగిలింది. 37వ ఓవర్ చివరి బాల్‌కు ట్రావిస్ హెడ్ ఓ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతిని క్యాచ్‌గా అందుకున్న ధోని అప్పీల్ చేశాడు.

 MS Dhoni makes fool out of Virat Kohli in Nagpur, fans go bonkers

అయితే అంపైర్ మాత్రం అవుటివ్వలేదు. దీంతో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లీని రివ్యూ తీసుకోవాల్సిందిగా ధోని కోరాడు. కోహ్లీ వెంటనే డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అయితే రీప్లేల్లో మాత్రం బంతి చాలా దూరం నుంచి వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో తొలి సారి డీఆర్ఎస్‌లో ధోని లెక్క తప్పింది. దీనిపై ట్విట్టర్‌లో కొందరు అభిమానులు ఇలా స్పందించారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+