Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్ బౌలౌట్‌ విజయం క్రెడిట్‌ అతడిదే: ఉతప్ప

MS Dhoni made it easier for us: Uthappa recalls T20 World Cup 2007 bowl out vs Pakistan

న్యూఢిల్లీ: 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి టైటిల్ ఒడిసిపట్టింది. టోర్నీలో భాగంగా లీగ్‌ దశలో పాకిస్తాన్‌పై సాధించిన విజయం ప్రత్యేకం. గతంలో ఎన్నడూ చూడనిది 'బౌలౌట్‌' అనే కొత్త విధానంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని అప్పటి యువ భారత జట్టు అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే లాక్‌డౌన్ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను వెటరన్‌ క్రికటెర్‌ రాబిన్‌ ఊతప్ప గుర్తుచేసుకున్నాడు.

బౌలౌట్‌ విజయం క్రెడిట్‌ ధోనీదే:

బౌలౌట్‌ విజయం క్రెడిట్‌ ధోనీదే:

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరుపున ఆడుతున్న రాబిన్‌ ఊతప్ప.. ఆ జ‌ట్టు నిర్వ‌హించిన ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా 2007 టీ20 ప్రపంచకప్ మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. 'బౌలౌట్‌ విజయం ఎప్పటికీ ప్రత్యేకమే. పాక్‌పై బౌలౌట్‌ విధానంతో గెలిచామంటే పూర్తి క్రెడిట్‌ అప్పటి కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనీకే దక్కుతుంది. ఎందుకంటే.. టోర్నీ ఆరంభానికి ముందు ధోనీ అందరిచేత బౌలౌట్‌ ప్రాక్టీస్‌ చేయించాడు' అని రాబిన్‌ ఊతప్ప తెలిపాడు.

ధోనీ కీపింగ్‌ చాలా స్పెషల్:

ధోనీ కీపింగ్‌ చాలా స్పెషల్:

'మ్యాచ్‌ టై అయి ఫలితం కోసం బౌలౌట్‌కు వెళ్లినప్పుడు వికెట్ల వెనకాల ఎంఎస్ ధోనీ చేసిన కీపింగ్‌ విధానం చాలా స్పెషల్‌. పాక్‌ కీపర్‌ కమ్రాన్‌ ఆక్మల్‌ రెగ్యులర్‌గా వికెట్ల వెనకాల నిల్చుంటే.. మహీ మాత్రం విభిన్నంగా వికెట్ల వెనకాల కూర్చొని ఉన్నాడు. దీంతో మేము అతడిని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్‌ చేసాం. దీంతో సులువుగా స్టంప్స్‌ పడగొట్టాట్టాం. అందుకే ఆ విజయం క్రెడిట్‌ ముమ్మాటికీ ధోనీకే దక్కుతుంది' అని ఊతప్ప పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌-పాక్‌ జట్ల స్కోర్లు సమమవ్వడంతో బౌలౌట్‌ విధానం ద్వారా విజేతను నిర్ణయించారు.

బౌలౌట్‌లో రాబిన్‌ సక్సెస్:

బౌలౌట్‌లో రాబిన్‌ సక్సెస్:

బౌలౌట్‌ కోసం టీమిండియా వీరేందర్ సెహ్వాగ్‌, రాబిన్ ఊతప్ప, ఎస్ శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్ ‌సింగ్‌ పేర్లను ప్రకటించగా.. పాకిస్థాన్‌ జట్టు ఉమర్‌ గుల్‌, సోహైల్‌ తన్వీర్‌, అరాఫత్‌, షాహిద్‌ అఫ్రిది, మొహమ్మద్ అసిఫ్‌లను ఎంచుకుంది. తొలి బంతిని సెహ్వాగ్‌ బౌల్డ్‌ చేయగా.. పాక్‌ బౌలర్‌ అరాఫత్‌ మిసయ్యాడు. రెండో బంతిని హర్భజన్‌‌ వేయగా అది కూడా వికెట్లను తాకింది. ఇక ‌గుల్‌ వేసిన రెండో బంతి వికెట్లను తాకలేదు. రాబిన్‌ మూడో బంతిని బౌల్డ్‌ చేయగా.. అఫ్రిదీ మూడో బంతిని వృథా చేశాడు. దీంతో ధోనీసేన విజయం సాధించింది. ఇక ఫైనల్లోనూ దాయాదిపైనే అద్భుత విజయం సాధించి భారత్ కప్ గెలుచుకుంది.

ఓపెనర్‌గా ఆడాడు కానీ:

ఓపెనర్‌గా ఆడాడు కానీ:

2006లో భార‌త జ‌ట్టులోకి అరంగేట్రం చేసిన రాబిన్ ఊత‌ప్ప‌.. జట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోలేక‌పోయాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన త‌ను ఆ త‌ర్వాత చెత్త ప్రదర్శనలు చేస్తూ కనుమరుగయ్యాడు. 13 ఏళ్ల కెరీర్‌లో ఊత‌ప్ప 46 వ‌న్డేలు, 13 టీ20లు మాత్రమే ఆడాడు. ఒకానొక సమయంలో ఓపెనర్‌గా కూడా ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. చివ‌రిసారిగా 2015లో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఆడాడు.

Story first published: Wednesday, May 20, 2020, 19:05 [IST]
Other articles published on May 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+