Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీనియర్ ఆటగాళ్లని తీసుకోవడానికే ధోనీ ఇష్టపడతాడు.. జట్టుకు అదే బలం!!

MS Dhoni loves to take chances with ageing players in CSK Team says Sanjay Manjrekar

ఢిల్లీ: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టులోకి సీనియర్ ఆటగాళ్లని తీసుకోవడానికే ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ ఇష్టపడతాడు అని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. ధోనీ నాయకత్వం చెన్నై జట్టుకు అతిపెద్ద బలం అని తెలిపాడు. లీగ్ ఆరంభం నుండి గమనిస్తే.. సాధారణంగా చెన్నై జట్టులో ఎక్కువ సీనియర్ ఆటగాళ్లు ఉంటారు.

డాడీస్ జట్టు:

డాడీస్ జట్టు:

ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, మురళి విజయ్, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్‌, షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రావో, ఇమ్రాన్‌ తాహిర్‌ వంటి క్రికెటర్లు చెన్నై జట్టులో ఉన్నారు. అందుకే ఆ జట్టును 'డాడీస్' జట్టు అని కూడా పిలుస్తుంటారు. ఇది కూడా మంజ్రేకర్ హైలైట్ చేశాడు. ఈ నెల 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది. ఈ సందర్భంగా ఓ క్రీడా ఛానెల్‌ కార్యక్రమంలో పాల్గొన్న మంజ్రేకర్ చెన్నై జట్టుపై స్పందించాడు.

వారిని తీసుకోవడమే ధోనీకి ఇష్టం:

వారిని తీసుకోవడమే ధోనీకి ఇష్టం:

'చెన్నై జట్టు ఎప్పుడూ సీనియర్‌ ఆటగాళ్లని కలిగి ఉంటుంది. డుప్లెసిస్‌, వాట్సన్‌, రైనా టాప్‌ ఆర్డర్‌లో ఉండగా.. రాయుడు, ధోనీ, జాదవ్ లాంటి ఆటగాళ్లు మిడిల్‌ ఆర్డర్‌లో ఉంటారు. బ్యాక్‌అప్‌ ఆటగాళ్లు కూడా ఉన్నారు. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాక్‌అప్‌ ఆటగాళ్లు కలిగి ఉండటం ఆ జట్టుకు మంచిది' అని మంజ్రేకర్ అన్నాడు.

జట్టుకు అతిపెద్ద బలం ధోనీ:

జట్టుకు అతిపెద్ద బలం ధోనీ:

'ధోనీ సీనియర్ ఆటగాళ్లని జట్టులోకి తీసుకోవడానికే ఇష్టపడతాడు. అతడి నాయకత్వం చెన్నై జట్టుకు అతిపెద్ద బలం. మహీ నాయకత్వం జట్టును మరో స్థాయికి తీసుకెళుతుంది. ధోనీ గత సీజన్‌ లాగే ప్రదర్శన చేస్తే వచ్చే సీజన్‌లో కూడా చెన్నై జట్టుకు ఎంతో ఉపయోగకరం' అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 2019 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 416 పరుగులు చేసాడు.

మరో రెండు సీజన్లు:

మరో రెండు సీజన్లు:

మరో రెండు సీజన్ల పాటు ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ ప్రాతినిథ్యం వహించనున్నట్లు చెన్నై జట్టు సన్నిహిత వర్గాల నుండి సమాచారం తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌‌లో ధోనీ భవితవ్యంపై ఓ స్పష్టత ఏర్పడింది. అయితే 2021 సీజన్ ముగిశాక ధోనీ ఆ ఏడాది జరిగే వేలంలో అందుబాటులోకి రానున్నాడు. మహీ వేలంలోకి వెళితే.. రైట్‌ టు మ్యాచ్‌ నిబంధన ఉపయోగించుకొని అతడిని తీసుకొనే అవకాశం చెన్నైకే ఉంటుంది. ఇప్పటి కన్నా ఇంకాస్త తక్కువ ధరకే చెన్నై అతడిని దక్కించుకోవచ్చు.

Story first published: Tuesday, December 3, 2019, 11:00 [IST]
Other articles published on Dec 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+