Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీని డైరక్టర్ చేసిన శంకర్ మధ్యలో రజనీకాంత్

MS Dhoni loves Suriya's films and Rajinikanth, says Jeeva Sankar who directed the cricketer

హైదరాబాద్: 'రన్ ఆడమ్' అనే క్రీడా సంస్థ కొత్త సంవత్సరానికి గాను ఓ యాడ్ చేయదలచింది. అయితే దాని అంబాసిడర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ యాడ్‌లో ఒక భాగమే. ఈ యాడ్ డైరక్షన్ చేసే అవకాశం జీవా శంకర్ చేతికొచ్చింది. ముంబైలో షూటింగ్ తీసేందుకు శంకర్ ప్రయాణమయ్యాడు.

జీవా శంకర్ అసలే మహేంద్రసింగ్ ధోనీకి వీరాభిమాని. దీంతో యాడ్ డైరక్షన్ చేసేందుకు ధోనీతో కొంచెం ఇబ్బందిపడ్డాడట. కానీ, ధోనీనే చొరవతీసుకుని మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయానంటున్నాడు. ముందుగానే క్రికెట్ గురించి కాకుండా సినిమాల గురించే మాట్లాడాలని నిర్ణయించుకున్న శంకర్ అదే టాపిక్‌ను కొనసాగించాడంట.

ఆ సంభాషణలో ధోనీ ఎక్కువగా రజనీకాంత్ గురించి అతని సాధారణ జీవన శైలి గురించే ఎక్కువ సార్లు అడిగాడని వివరించాడు. ధోనీకి హీరో సూర్య సినిమాలంటే కూడా ఇష్టమని చెప్పాడట. సబ్ టైటిళ్ల సాయంతో అతని సినిమాలు కూడా చూస్తానని వివరించాడంట.

'నెల రోజుల క్రితం 'రన్‌ అడమ్‌' సంస్థ నిర్వాహకులు చేసిన యాడ్‌లోధోనీతో జీవా శంకర్ కాసేపు సరదాగా ముచ్చటించాడు. అయితే ఈ సరదా సంభాషణ అంతా శంకర్ రెండు గంటల పాటు జరిగిందని మీడియాతో పంచుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 16:01 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+