For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా ఆఖరి మ్యాచ్‌: ధోని 68 నాటౌట్, రాయుడు సెంచరీ

ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో కెప్టెన్‌గా ఇంగ్లాండ్ జట్టుతో తన ఆఖరి మ్యాచ్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని టాస్ ఓడిపోయాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: బ్రాబోర్న్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్‌గా తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న ధోని 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

రాయుడు రిటైర్డ్ హట్: యువరాజ్ అర్ధ సెంచరీ
ఇంగ్లాండ్‌తో జరుతున్న తొలి వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన అంబటి రాయుడు రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగాడు. ఆద్యంతం నిలకడ ప్రదర్శించిన రాయుడు తన పూర్వవైభవాన్ని చాటుకున్నాడు. మరోవైపు రాయుడికి జతగా కలిసిన యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు.

క్రీజులోకి వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించిన యువీ కచ్చితమైన షాట్లతో అభిమానుల్ని అలరించాడు. సిక్సర్లు, బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతకుముందు శిఖర్ ధావన్(63) రెండో వికెట్‌గా వెనుదిరిగగా, తొలి వికెట్‌గా మన్ దీప్ సింగ్(8) పెవిలియన్ చేరాడు.

తొలి వార్మప్ మ్యాచ్‌లో రాయుడు సెంచరీ
ఇంగ్లాండ్‌తో జరుతున్న తొలి వార్మప్ మ్యాచ్‌లో అంబటి రాయుడు సెంచరీ సాధించాడు. 97 బంతులను ఎదుర్కొన్న రాయుడు 11 ఫోర్లు, ఒక సిక్సుతో సెంచరీని నమోదు చేశాడు. దీంతో 41 ఓవర్లుకు గాను భారత ఏ జట్టు 2 వికెట్లను కోల్పోయి 227 పరుగులు చేసింది.

Ambati Rayudu

63 పరుగుల వద్ద ధావన్ అవుట్
బ్రాబోర్న్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ అనంతరం శిఖర్ ధావన్ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జేక్ బాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

అర్ధ సెంచరీలతో రాణించిన రాయుడు, శిఖర్ ధావన్
బ్రాబోర్న్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ఏ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధావన్, అంబటి రాయుడులు అర్ధ సెంచరీలు సాధించారు. 73 బంతులను ఎదుర్కొన్న ధావన్ 7 ఫోర్లు, 1 సిక్సుతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

57 బంతులను ఎదుర్కొన్న రాయుడు ఆరు ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్ మన్ దీప్ సింగ్ (8) ఆదిలోనే నిష్క్రమించి నిరాశపరిచాడు. ఆ తర్వాత ధావన్‌తో జతకలిసిన రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత జట్టు 28.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది.

ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో కెప్టెన్‌గా ఇంగ్లాండ్ జట్టుతో తన ఆఖరి మ్యాచ్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

మంగళవారం మధ్యాహ్నం 1. 30 గంటల నుంచి ఇంగ్లాండ్, భారత్ ఏ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు చివరిసారిగా ధోని కెప్టెన్‌గా వ్వవహరిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 15న మొదలయ్యే వన్డే సిరీస్‌కు సన్నాహకంగా భారత్ ఏ, ఇంగ్లాండ్ లెవెన్‌ జట్లు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.

మంగళవారం జరిగే తొలి డే/నైట్‌ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, గురువారం ఇదే స్టేడియంలో జరిగనున్న మ్యాచ్‌కి అజింక్యా రహానె భారత ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ వార్మప్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.

MS Dhoni loses toss in last match as captain

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ధోని ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో అతనేం చేస్తాడోనని ఆసక్తి నెలకొంది. దీనిలో భాగంగా ఈ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్ లను ఇవ్వనున్నట్లు తెలిపింది.

అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా అభిమానుల్ని ఉచితంగానే స్టేడియంలోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రీగా ఆటను చూసేవారికి కేటాయించిన నార్త్, ఈస్ట్ స్టాండ్లు నిండిపోతే మధ్యాహ్నం 3 గంటలకు గేట్లను మూసివేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించిన ధోనిని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జ్ఞాపికతో సత్కరించింది. 2007లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ధోని భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.

జట్లు వివరాలు:
టీమిండియా: శిఖర్‌ ధావన్‌, మన్‌దీప్‌ సింగ్‌, అంబటి రాయుడు, యువరాజ్‌ సింగ్‌, ధోని, హార్దిక్‌ పాండ్యా, సంజు శాంసన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, నెహ్రా, మోహిత్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌.
ఇంగ్లాండ్‌: ఇయాన్‌ మోర్గాన్‌, మొయిన్‌ అలీ, జానీ బెయిర్‌స్టో, జేక్‌ బాల్‌, శామ్‌ బిలింగ్స్‌, జోస్‌ బట్లర్‌, లియామ్‌ దాడసన్‌, అలెక్స్‌ హేల్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, అదిల్‌ రషీద్‌, జాసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, డేవిడ్‌ విలే, క్రిస్‌ వోక్స్‌.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+