For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni: ఆగ్రహంతో ఊగిపోయిన 'కెప్టెన్ కూల్'(వీడియో వైరల్)

MS Dhoni Angry: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సీఎస్కేను 2 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇది ప్రస్తుత సీజన్‌లో సీఎస్కేకు 9వ ఓటమి. ఈ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్‌కు ఒక ఓవర్ మిగిలి ఉన్నప్పటికీ ఎంఎస్ ధోని ఖలీల్ అహ్మ‌ద్‌పై నమ్మకం ఉంది 19వ ఓవర్లో బౌలింగ్ చేయమని పిలిచాడు. కానీ రొమారియో షెపర్డ్ విజృంభించడంతో ఖలీల్ అహ్మద్ అతని ముందు తేలిపోయాడు. ఈ ఓవర్లో ఖలీల్ అహ్మద్ 33 పరుగులు ఇచ్చి సీఎస్కే ఓటమికి బాధ్యత వహించాడు. ఈ మ్యాచ్‌లో ఒక క్షణం మైదానం మధ్యలోనే ఖలీల్ అహ్మద్‌పై ఎంఎస్ ధోని ఆగ్రహంతో ఊగిపోయాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఖలీల్ అహ్మద్‌పై ధోనీ ఆగ్రహం
నిజానికి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని ఆగ్రహంగా కనిపించాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రవీంద్ర జడేజా క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేస్తుండగా.. ధోని ఫీల్డ్ సెట్ చేస్తున్నప్పుడు కోపంగా కనిపించాడు. నిజానికి ఖలీల్ తప్పుడు ఫీల్డింగ్ పొజిషన్ చూసి ధోని నిరాశ చెందినట్లు కనిపించాడు. ధోనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ధోని ఖలీల్ అహ్మద్‌తో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఎంఎస్ ధోని ఖలీల్ అహ్మద్‌ను ఉద్దేశించి అక్కడ ఎవరైనా ఫీల్డింగ్ చేయడం నువ్వు ఎప్పుడైనా చూశావా?.. అంటూ అడుగుతున్నాడు.

MS Dhoni Loses Cool on Khaleel Ahmed During CSK vs RCB Match Viral Video

పవర్ ప్లేలోని మొదటి 2 ఓవర్లలో ఖలీల్ అహ్మద్ 32 పరుగులు, ఆపై రొమారియో షెపర్డ్‌కు వేసిన 19వ ఓవర్లో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విధంగా ఖలీల్ అహ్మద్ పేరిట ఒక చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన సీఎస్కే బౌలర్ అతనే కావడం గమనార్హం. ఖలీల్ అహ్మద్ రాజస్థాన్ రాయల్స్‌పై లుంగీ ఎంగిడికి ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

ఖలీల్‌కు మద్దతుగా సీఎస్కే కోచ్
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ సందర్భంగా సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఖలీల్‌కు అవకాశం ఇవ్వాలనే నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ సీజన్‌లో ఖలీల్ అహ్మద్ బాగా రాణించాడని.. కాబట్టి ఎంఎస్ ధోని అతడికి అవకాశం ఇవ్వకపోవడానికి ఎటువంటి కారణం లేదని అన్నాడు. అన్షుల్ కాంబోజ్ కూడా తన పాత్రను చక్కగా పోషిస్తున్నాడని చెప్పాడు. అతడికి డెత్ ఓవర్లలో బౌల్ చేయగల సామర్థ్యం ఉందన్నాడు. వారికి ముందుకు సాగే అవకాశం ఉందని.. కానీ ఖలీల్ ను తొలగించడానికి ఎటువంటి కారణం లేదని చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, May 4, 2025, 17:11 [IST]
Other articles published on May 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+