Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2019 వరల్డ్ కప్ కోహ్లీసేనదే: వివాదాస్పద ట్వీట్‌ను లైక్ చేసిన ధోని

MS Dhoni likes a tweet after three years, but social media gets a shocker - This is why

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లైక్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. 2009లో ధోని ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ ఎనిమిదేళ్లలో అతడు కేవలం మూడు సార్లు మాత్రమే ట్వీట్స్‌ను లైక్ చేశాడు.

తొలిసారి 2013లో రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్‌ను, 2014, డిసెంబర్ 31 బీసీసీఐ చేసిన ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు సంబంధించిన ట్వీట్‌ను ధోని లైక్ చేశాడు. మళ్లీ దాదాపు మూడేళ్ల తర్వాత మంగళవారం ధోని మరో ట్వీట్‌కు లైక్ చేశాడు.

అదే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆ ట్వీట్‌ను ఇండియా న్యూస్‌కు చెందిన ఇన్‌ఖబర్ పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే '2019 వరల్డ్‌కప్ ఫిక్సయింది.. ఈసారి అది పక్కాగా ఇండియాకే' అన్నది సారాశం. ట్వీట్ పోస్ట్ చేసిన సమయంలో కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రితోపాటు బీసీసీఐ, మాజీ క్రికెటర్లు కొందరి అకౌంట్లు కూడా ట్యాగ్ చేశారు.

అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని చాన్నాళ్ల తర్వాత ఈ వివాదాస్పద స్టోరీకి లైక్ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ వివాదాస్పద స్టోరీని లైక్ చేయాల్సి అవసరం ధోనికి ఏమొచ్చిందని అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తమ స్టోరీని ధోనీలాంటి గొప్ప ఆటగాడు లైక్ చేశాడని ఆ న్యూస్ చెప్పుకోవడం ఇక్కడ కొసమెరుపు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 14:27 [IST]
Other articles published on Dec 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+