హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడే ఆవకాశం కనిపిస్తుంది. గత అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసినప్పటి నుంచి ధోని ఇప్పటివరకు ఏ మ్యాచ్ ఆడలేదు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో జనవరి 10, 12న ముంబైలోని సీసీఐ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు భారత్-ఏ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో వన్డే సిరిస్‌కు ముందు ధోనికి మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడం కోసం భారత్-ఏ జట్టులో ధోనికి బీసీసీఐ చోటు కల్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మూడు వన్డేల సిరిస్‌కు సన్నాహకంగా ఈ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్ సిరిస్ అనంతరం ధోని ఇప్పటివరకు ఎలాంటి టోర్నీల్లో ఆడలేదు. ఇంగ్లాండ్‌తో జనవరి 15న పూణెలో జరిగే తొలి వన్డేతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అప్పటికి ధోని మ్యాచ్ ఆడకుండా 77 రోజులవుతుంది.

అయితే వామప్ మ్యాచ్‌లు గాకుండా నేరుగా వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడకుండా ధోనీ పాల్గొంటే రెండు నెలలకు పైగా క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉన్నట్లు అవుతుంది.
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాక ధోనీ రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించడం లేదు. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రమే సొంత రాష్ర్టానికి ఆడుతున్నాడు. అయితే జార్ఖండ్ రంజీ జట్టుతో ధోని రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంటూ ఫిట్‌నెస్ మెరుగు పరచుకుంటున్నాడు.