ధర్మశాల: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా తొలి వన్డే కోసం ధర్మశాలకు గురువారం చేరుకుంది. కెప్టెన్ ధోనితో పాటు టీమిండియా, కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
న్యూజిలాండ్‌పై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0 తేడాతో విజయం సాధించిన టీమిండియా వన్డే సిరిస్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది జింబాబ్వేలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 3-0తో గెలిపించిన మహేంద్ర సింగ్ ధోని సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.
టీమిండియా టెస్టు సిరిస్ నెగ్గిన నేపథ్యంలో ఈ ఐదు వన్డేల సిరిస్ ధోనికి ఎంతో కీలకంగా మారింది. అంతేకాదు టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన అశ్విన్, జడేజా, పుజారా లేకుండా కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో ధోని జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం.
బుమ్రా, కేదార్ జాదవ్, మనీష్ పాండే, హర్దిక్ పాండ్యలతో పాటు స్పిన్నర్లు అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌ను మహి ఎంతమేరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. మరోవైపు భారత వన్డే జట్టులో చోటు దక్కాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే రిజర్వ్ బెంచ్‌లో చాలా పెద్ద క్యూ ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మన్‌దీప్ సింగ్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. గాయం కారణంగా ధావన్, మోకాలి కండర గాయం నుంచి రాహుల్ కోలుకోకపోవడంతో మన్‌దీప్‌కు అవకాశం దక్కింది. తొలి వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.
ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన మన్‌దీప్ మూడు టీ20ల్లో చక్కగా రాణించాడు. అంతేకాకుండా ఆసీస్ ఎతో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మన్‌దీప్‌కు న్యూజిలాండ్ సిరిస్‌లో అవకాశం ఇచ్చారు.
కాగా న్యూజిలాండ్‌తో 93 వన్డేలాడిన టీమిండియా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కివీస్ 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. గత ఐదు వన్డేల్లో కివీస్‌దే ఆధిపత్యం. చివరిగా ఆడిన వన్డేలోనూ భారత్‌కు ఓటమే ఎదురైంది.
ఐదు వన్డేల మ్యాచ్ షెడ్యూల్:
అక్టోబర్ 16 తొలి వన్డే ధర్మశాల
అక్టోబర్ 20 రెండో వన్డే న్యూఢిల్లీ
అక్టోబర్ 23 మూడో వన్డే మొహాలీ
అక్టోబర్ 26 నాలుగో వన్డే రాంచి
అక్టోబర్ 29 ఐదో వన్డే విశాఖపట్నం