Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆప‌ద్బాంధ‌వా!..మ్యాచ్ ర‌క్ష‌కా!!: గెలిపించాలంటూ ధోనీని ప్రార్థిస్తోన్న ఫ్యాన్స్‌!

 MS Dhoni Last Hope: Fans Pray During ICC Cricket World Cup 2019 Semi-Final

మాంచెస్ట‌ర్‌: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి సెమీఫైన‌ల్‌లో పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన భార‌త జ‌ట్టును ఆదుకునే ఏకైక ఆప‌ద్బాంధ‌వుడిగా మ‌హేంద్ర‌సింగ్ ధోనీని భావిస్తున్నారు అభిమానులు. ఆయ‌న‌ను శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడిగా చిత్రీక‌రిస్తున్నారు. మెమెల‌ను త‌యారు చేస్తున్నారు. మ‌రికొంద‌రు ధోనీని బాహుబ‌లిగా కీర్తిస్తున్నారు. ప్ర‌స్తుతం ధోనీ, ర‌వీంద్ర జ‌డేజా క్రీజులో ఉన్నారు.

ఓ మోస్త‌రు షాట్ల‌ను ఆడుతున్నారు. స్కోరు బోర్డును మెల్లిగా కదిలిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి జోడి ఇక అవుట్ కాకుండా నిల‌బ‌డాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. వారిద్ద‌రూ చివ‌రి వ‌ర‌కూ క్రీజులో పాతుకుని పోతే- విజ‌యంపై ఢోకా ఉండ‌ద‌ని ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో- క్రికెట్ బ్యాట్‌ను వేణువులా ప‌ట్టుకుని డ్రెస్సింగ్‌రూమ్‌లో క‌నిపించిన ధోనీ ఫొటోను పిల్ల‌నగ్రోవిని ఊదుతున్న శ్రీకృష్ణుడిలా చిత్రీక‌రించారు. మెమెల‌ను ఎడ‌తెరిపి లేకుండా సంధిస్తున్నారు.

Story first published: Wednesday, July 10, 2019, 18:54 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+