Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టౌరంగా అందాలకు ఫిదా: రెండో వన్డే కోసం రోడ్డు మార్గంలో కోహ్లీసేన

MS Dhoni, Kuldeep Yadav And Others Enjoy Scenic Route To Tauranga For 2nd ODI

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో రెండో వన్డే శనివారం మౌంట్ మాంగానుయ్‌లో జరగనుంది.

దీంతో గురువారం నేపియర్ నుంచి భారత క్రికెట్ జట్టు రోడ్డు మార్గం ద్వారా అక్కడికి వెళ్లింది. మధ్యమధ్యలో ఆగుతూ ప్రకృతి అందాలను చూస్తూ టీమిండియా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నాడు.

కుల్దీప్‌తోపాటు ధోని, చాహల్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ ఫొటోలకు పోజులిచ్చారు. తొలి వన్డేలో బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో కివీస్ టీమ్‌కు 157 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా డక్ వర్త్ లూయిస్ ప్రకారం 8 వికెట్లతో విజయం సాధించింది.

స్పిన్ మ్యాజిక్‌తో కుల్దీప్ యాదవ్, హాఫ్ సెంచరీతో శిఖర్ ధావన్, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కొహ్లీ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డే విజయంతో జోరు మీదున్న టీమిండియాకే సిరీస్ విజయాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Story first published: Thursday, January 24, 2019, 17:55 [IST]
Other articles published on Jan 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+