తాత్కాలిక ఫుట్‌బాల్ కోచ్‌గా మారిన ధోనీ

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా మారాడు. ముంబై వేదికగా జరగనున్న ఆల్ స్టార్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు బాలీవుడ్ నటులతో పాటు ధోనీ కూడా సిద్ధమవుతున్నాడు. ఎప్పటి నుంచో టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్.. ధోనీ ఫుట్‌బాల్ ఆటకు అమితాసక్తి. చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన ధోనీ.. బాలీవుడ్ హీరోలతో ఆల్ స్టార్స్ చారిటీ సాకర్ మ్యాచ్ కోసం సమాయత్తమవుతున్నాడు.

బాలీవుడ్ హీరోకు సాకర్ టిప్స్ ఇస్తోన్న ధోనీ
ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కట్టర్ ఆటకు ముగ్ధుడై.. దఢక్ హీరోకు కొన్ని విలువైన సలహాలిచ్చాడు. భారత క్రికెట్ దిగ్గజం ధోనీ బాలీవుడ్ హీరోకు సాకర్ టిప్స్ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తరచుగా అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్‌లతో ఫుట్‌బాల్ ఆడుతూ.. కనిపించే ఇషాన్ కట్టర్ ధోనీతో కలిసి ప్రాక్టీసు శిబిరంలో పాల్గొన్నాడు.

రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మస్త్రా
రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మస్త్రా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా.. అభిషేక్ బచ్చన్ తన సతీమణి బాలీవుడ్ అగ్రతార అయిన ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్‌లతో లండన్‌లో షికార్లు కొడుతున్నాడు.

జీవా ధోనీ వేసిన బుడిబుడి స్టెప్పులు
ఇటీవలే ధోనీ అతని కుటుంబంతో కలిసి మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణా పటేల్‌తో జరిగిన ఓ సంగీత్‌లో పాల్గొన్నాడు. కాగా ఆ పార్టీకి మిగిలిన క్రికెటర్లు హాజరైనా.. ధోనీ కుటుంబమే హైలెట్‌గా నిలిచింది. ఆ కార్యక్రమంలో జీవా ధోనీ వేసిన బుడిబుడి స్టెప్పులు అందరినీ అలరించాయి.

కోట్లను కొల్లగొడుతున్న ధడక్:
ఇషాన్ కట్టర్ నటించిన రెండో సినిమా.. ధడక్ శుక్రవారం విడుదలై కోట్లను కొల్లగొడుతుంది. ఇందులో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మరాఠీ సినిమా అయిన సైరట్ (2016) ఆధారంగా చిత్రీకరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications