Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సోషల్ మీడియా వైరల్: కుమార్తె జీవాతో ధోని ఫన్నీ వీడియో

MS Dhoni is Zivas bugs bunny in adorable video

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో సెలక్టర్లు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు దొరికిన విరామ సమయాన్ని ధోని ప్రస్తుతం కుటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం దొరికితే ధోని కుటుంబంతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతాడు. ముఖ్యంగా తన ముద్దుల కుమార్తె జీవాతో సరదాగా ఆడిపాడుతుంటాడు. తాజాగా తన కుమార్తెతో ఆడుకుంటుండగా తీసిన వీడియోను ధోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

జీవా కోసం ధోని బ‌గ్స్ బ‌న్నీ పాత్ర పోషించాడు. ఒక యానిమేటెడ్ కార్టూన్ పాత్ర తరహాలో పెద్ద క్యారట్‌ను జివా ధోనికి తినిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'జీవా' బగ్స్ బన్నీ అనే క్యాప్షన్ పెట్టాడు. ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత టీ20 జట్టులో ధోనికి చోటుదక్కని సంగతి తెలిసిందే.

గత కొంతకాలంగా బ్యాట్‌తో ధోని నిరాశ పరుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌లో సైతం ధోని ఆశించిన స్థాయిలో రాణించలేదు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ నేపథ్యంలో రిజర్వ్‌ వికెట్‌ కీపర్‌ కోసం సెలక్టర్లు విండీస్‌, ఆసీస్‌తో టీ20సిరీస్‌ల్లో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కు అవకాశం ఇచ్చారు.

Story first published: Saturday, November 24, 2018, 14:50 [IST]
Other articles published on Nov 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+