కాన్పూర్‌కు కోహ్లీ సేన: ధోనికి ఘన స్వాగతం (ఫోటోలు)
హైదరాబాద్: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే టెస్టు, వన్డే మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 26న తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో పాటు ఇరు జట్లు సోమవారం కాన్పూర్‌కు చేరుకున్నాయి.
కాన్పూర్‌కు కోహ్లీ సేన: ధోనికి ఘన స్వాగతం (ఫోటోలు)
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది. రెండో టీ20 నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుండా, సిరిస్‌లో చివరి టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. కాన్పూర్‌లో జరగనున్న తొలి టీ20 జనవరి 26న సాయంత్రం 4.30 ప్రారంభం అవుతుంది. రెండు, మూడో టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.

జనవరి 26న సాయంత్రం 4.30కు తొలి టీ20
కాగా, ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు, వన్డే సిరిస్‌లను గెలుచుకుని టీమిండియా ఉత్సాహాంతో ఉంది. ఈ నేపథ్యంలో టీ20ని కూడా గెలుచుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టెస్టులు, వన్డే సిరిస్‌లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ టీ20 సిరిస్ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది.

కాన్పూర్‌లో ధోనికి ఘన స్వాగతం
తొలి టీ20ని పురస్కరించుకుని కాన్పూర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యం.

కాన్పూర్‌లో యువీకి ఘన స్వాగతం
తొలి టీ20ని పురస్కరించుకుని కాన్పూర్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్‌కి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications