'ధోనీ యూనివర్సిటీలో టాపర్.. నేనొక స్టూడెంట్ మాత్రమే'

హైదరాబాద్: శ్రీలంక వేదికగా జరిగిన బంగ్లాదేశ్‌తో ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగాసంచలన బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించిన దినేశ్ కార్తీక్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్‌లను ముగించడంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అతడిని పోలుస్తున్నారు అభిమానులు. ధోని తర్వాత ఫినిషర్ పాత్ర పోషించబోయేది కార్తీకే అని కూడా అంటున్నారు. దీనిపై కార్తీక్ స్పందించాడు. తనను ధోనీతో పోల్చవద్దని కోరాడు.
'ధోని టాపర్‌గా ఉన్న యూనివర్శిటీలో నేను చదువుకుంటున్నా. నేను స్ఫూర్తి కోసం చూసే ఆటగాళ్లలో అతనొకడు. నన్ను అతడితో పోల్చడం సబబు కాదు. ప్రస్తుతం నేనున్న స్థితితో సంతృప్తిగా ఉన్నా' అని కార్తీక్ స్పష్టం చేశాడు. ధోని కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కార్తీక్.. అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాడు. అతడి తర్వాత భారత జట్టులోకి వచ్చిన ధోని ఆటగాడిగా, కెప్టెన్‌గా తిరుగులేని స్థాయిని అందుకున్నాడు.

కలిసొచ్చి ఆ సిక్సర్ బాదేలా:
ఈ నేపథ్యంలో కార్తీక్ మాట్లాడుతూ.. ‘ధోనితో పోలిస్తే నా ప్రయాణం పూర్తి భిన్నమైంది. అతను గొప్ప ఆటగాడు. ఒకప్పుడు ధోని సిగ్గరి. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కానీ ఇప్పుడు కుర్రాళ్లకు సాయం చేసేందుకు చాలా మాట్లాడుతున్నాడు' అని చెప్పాడు. ఆదివారం నాటి ఇన్నింగ్స్‌తో తనపై అందరి దృష్టి నిలవడం మంచి అనుభూతినిస్తోందని, ఇన్నేళ్లలో తాను చేసిన మంచి పనులు నాకు కలిసొచ్చి ఆ సిక్సర్ బాదేలా చేశాయనుకుంటున్నానని కార్తీక్ అన్నాడు.

రెండేళ్ల కిందట ఫామ్ కోల్పోయి:
‘ఈ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. క్రికెట్ ఆడటం నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం. హఠాత్తుగా ఇంత గుర్తింపు రావడం గొప్పగా అనిపిస్తోంది. అయితే ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి ఇది మంచి ఆరంభం అనుకుంటున్నా' అని చెప్పాడు. రెండేళ్ల కిందట ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నపుడు తనకు అండగా నిలిచి, శిక్షణ ద్వారా తాను మెరుగుపడేందుకు కృషి చేసిన ముంబై ఆటగాడు అభిషేక్ నాయర్‌పై కార్తీక్ ప్రశంసలు కురిపించాడు.

మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యే విషయంలో నాయర్:
‘గత రెండేళ్లలో నా కెరీర్ ఎదుగుదలలో అతడి పాత్ర ఎంతో కీలకం. మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యే విషయంలో నాయర్ నాకు సాయం చేశాడు. వ్యూహాల విషయంలో ఆలోచించేలా చేశాడు. శ్రమించడానికి సరైన మార్గమేంటో అతడికి తెలుసు. ఈ ప్రయాణంలో అతను నది అయితే.. నేను పడవ అని చెప్పొచ్చు' అన్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో బంతులు వృథా చేసి విమర్శలెదుర్కొన్న విజయ్ శంకర్‌కు కార్తీక్ అండగా నిలిచాడు. అతను ప్రతిభావంతుడని చెప్పాడు.

శంకర్‌కు మంచి భవిష్యత్తు:
‘శంకర్‌కు నైపుణ్యం ఉంది. బౌలర్‌గా అతను చక్కటి ప్రదర్శన చేశాడు. ఒత్తిడిలో అతను బాగానే ఆడాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడిది ప్రత్యేకమైన ప్రతిభ. శంకర్ చాలా కాలం ఆడతాడు'' అన్నాడు. తన కంటే ముందు శంకర్‌ను బ్యాటింగ్‌కు పంపిన రోహిత్ శర్మకు కూడా కార్తీక్ మద్దతిచ్చాడు.

రోహిత్‌కు ఎంతో ఆత్మవిశ్వాసం:
‘కెప్టెన్‌గా రోహిత్ మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు. తన సామర్థ్యంపై, జట్టును నడిపించే విషయంలో రోహిత్‌కు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ప్రతి మ్యాచ్‌కు ముందు రోహిత్ ఎన్నో వ్యూహాలు రచిస్తాడు. అతను తిరుగులేని కెప్టెన్' అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications