Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడే బెస్ట్ 'జడ్జి': ధోని రిటైర్మెంట్‌పై సచిన్ వివరణ

హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంకా కొన్ని రోజుల పాటు క్రికెట్‌లో కొనసాగాలని కోరుకునే వారి జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేరాడు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సచిన్ ప్రస్తుతానికి ధోని ఫిట్‌గా ఉన్నాడని మరికొన్ని రోజులు క్రికెట్ ఆడొచ్చని అన్నాడు.

అలెన్ బోర్డర్‌కు షాక్: వన్డే కెప్టెన్‌గా ధోని ఖాతాలో మరో రికార్డు

ఇప్పటికీ ధోని మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నాడని, అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలనే విషయాన్ని అతడే నిర్ణయించుకుంటాడని తెలిపాడు. 'ధోని ప్రదర్శన వయసుతో సంబంధం లేకుండా ఉంది. టీ20 క్రికెట్ అనేది కేవలం యువకులకు మాత్రమే అని రాస్తున్నారు, అది తప్పు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్ హాగ్ 44 ఏళ్ల వయసులో కూడా ఆడుతున్నాడు' అని సచిన్ తెలిపాడు.

కేవలం ఫిట్ నెస్‌తోనే ఇదంతా సాధ్యమవుతుందని అన్నాడు. శారీరకంగా ఫిట్‌గా ఉన్న ఆటగాడు మానసికంగా భారత్‌కు ఆడాలని భావించడం అనేది అతని ఛాయిస్ అని అన్నాడు. తన శరీరం, మనసలు ఏవిధంగా ఉన్నాయనే విషయం కేవలం అతడికి మాత్రమే తెలుస్తాయని ధోనికి సచిన్ మద్దతు పలికాడు.

అతడే జడ్జి చేయగలుగుతాడని సచిన్ తెలిపాడు. అతడికే నిర్ణయాన్ని వదిలేయాలని అన్నాడు. 34 ఏళ్ల ధోని డిసెంబర్ 2014లో ఆస్ట్రేలియాతో సిరిస్ జరుగుతున్న సమయంలోనే హఠాత్తుగా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అనంతరం పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కొనసాగుతున్నారు.

MS Dhoni is the best judge as far as his retirement is concerned: Sachin Tendulkar

మరోవైపు 2019 వరల్డ్ కప్ వరకు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. ధోని నేతృత్వంలోని టీమిండియా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌లో కూడా ధోని సేన విజయాన్ని సాధించింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జట్టులో సమతుల్యత చక్కగా ఉందని ఇదే జట్టుని 2019 వరకు కొనసాగించాలనే ఆలోచనకు సెలక్టర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరంగా ధోని చక్కగా ఉన్నాడని, వచ్చే వరల్డ్ కప్ వరకు ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగితే సెలక్టర్లకు కూడా వారి జాబ్ సులభం అవుతుందని కమిటీలోని సభ్యుడు ఒకరు తెలిపారు.

వయసుతో పాటు ఫిట్ నెస్ పరంగా ధోని అత్యుత్తమ ప్రదర్శన కనపరుస్తుండటంతో ధోనిని తప్పించాలనే ఆలోచన కూడా సెలక్టర్లకు లేదని తెలిపారు. 2017లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సెలక్టర్లు దృష్టి సారించనున్నారు. దీని తర్వాతే ధోని భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ధోని సేవలు ఇంకా టీమిండియాకు అవసరమని అతడు స్పష్టం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+