'ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనియే'
హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియేనని ఛీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో జట్టులో ధోనిని ఎంపిక చేయడంపై ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా భావిస్తున్న ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్‌ని భవిష్యత్ కీపర్‌గా పేర్కొన్నాడు. ధోని రిటైర్‌మెంట్ నిర్ణయం పంత్ కెరీర్‌ను నిర్దేశిస్తుందని చెప్పాడు. 'ప్రపంచంలో అత్యుత్తమ కీపర్ ఎవరని మీరు నమ్ముతున్నారు? ధోనీయే అని మనమంతా నమ్ముతున్నాం. మనం కేవలం అతడి బ్యాటింగ్ ఫామ్ గురించే ఆందోళన చెందుతున్నాం' అని అన్నారు.

కోహ్లీని గైడ్ చేయడానికి అతనే కరెక్ట్ పర్సన్
'టీమిండియాకు అతడొక వెలకట్టలేని ఆస్తి. కోహ్లీని గైడ్ చేయడానికి అతనే కరెక్ట్ పర్సన్. ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో జట్టుకు అద్భుతంగా ఉపయోగపడతాడు. అతడి లివితేటలు కోహ్లీకి మార్గనిర్దేశం చేస్తాయి. ధోని కీపింగ్‌పై తమకు ఎలాంటి డౌట్ లేదని, అయితే అతని బ్యాటింగ్ ఫామ్‌పై మాత్రమే తాము ఫోకస్ చేశాం' అని ఎమ్మెస్కే అన్నాడు.

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్
'10-12 ఏళ్ల కెరీర్‌లో కీపింగ్‌లో ఒక్కరోజైనా ధోని పొరపాటు చేసినట్లు కనిపించడు. అందుకే అతడు మా దృష్టిలో ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్. బ్యాటింగ్ గురించి మాకు ఆందోళన లేదు' అని ఎమ్మెస్కే అన్నాడు. ఇక రిషబ్ పంత్ ఆటతీరు తమకెంతగానో నచ్చిందని ఎమ్మెస్కే అన్నాడు.

పంత్‌కు సుదీర్ఘ క్రికెట్ కెరీర్ ఉంది
‘పంత్ క్రికెట్‌లో ఎదుగుతున్న కుర్రాడు. అతడి ముందు సుదీర్ఘ కెరీర్ ఉంది. భవిష్యత్తులో అతడు తప్పకుండా విజయవంతం అవుతాడని మేం కచ్చితంగా చెప్పగలం' అని ప్రసాద్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా టీమిండియాకు ఎంపిక చేయలేమని స్పష్టం చేశాడు.

యువ ఆటగాళ్ల ప్రశ్నకు
యువ ఆటగాళ్లకు జట్టులో ఎందుకు చోటు కల్పించడం లేదన్న ప్రశ్నకు గాను హార్దిక్‌పాండ్యా, బూమ్రా యువ ఆటగాళ్లు కాదా? అని ఎమ్మెస్కే ప్రశ్నించాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్ ఎంపికైన తర్వాత నిలకడగా రాణిస్తున్నందునే హార్దిక్‌పాండ్యా, బూమ్రా వంటి కుర్రాళ్లకు ఛాంపియన్స్‌ట్రోఫీ జట్టులో చోటు కల్పించామని అన్నాడు.

ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను చూస్తున్నాం
ఇక యువ ఆటగాళ్లు సంజు శాంసన్, బాసిల్ థంపీ వంటి వర్ధమాన క్రికెటర్లు భారత ఏ జట్టులో మంచి ప్రదర్శనలు చేయాల్సి ఉందని చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్ల ప్రదర్శనను గమనిస్తున్నామని, ఆటగాళ్ల సామర్థ్యాలను అన్ని విధాలా పరీక్షించాకే 50 ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేస్తామని ఎమ్మెస్కే అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications