ఇప్పటికీ ధోనీయే బెస్ట్: కోహ్లీపై ఆసిస్ మాజీ ఆటగాడు ఇలా..
న్యూఢిల్లీ: ఇప్పటికీ భారత క్రికెట్ జట్టు ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఫినిషర్ అని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్సుమెన్ డేవిడ్ బూన్ అన్నాడు. అతనిని ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేమని అభిప్రాయపడ్డాడు.
బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీలో ఆ స్కిల్స్ ఇప్పుడు కనిపించడం లేదా అని అడిగితే.. ఆ ప్రశ్నతో డేవిడ్ బూన్ ఏకీభవించలేదు.

ధోనీ చాలా అద్భుతమైన ఆటగాడు అని చెప్పాడు. అతను ఓ అసాధారణమైన బ్యాట్సుమెన్ అన్నాడు. తాను చూసిన బెస్ట్ ఫినిషర్‌లలో ధోనీయే చాలా ఉత్తమమం అన్నాడు. ఇప్పటికీ అతనే ఉత్తమ్ం అని చెప్పాడు. అలాగే తన భవిష్యత్తు విషయంలో ధోనీయే నిర్ణయం తీసుకోగలడన్నాడు.
తన కెరీర్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ధోనీకి తెలుసునని చెప్పాడు. అప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతను చాలా దుకుడైన అటగాడు అన్నాడు. అతను అన్ని సందర్భాల్లోను బాగా ఆడగలడన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications