For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ దాసుడైపోయాడు.. నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడు: సాక్షి

MS Dhoni is sleep talking PUBG these days: Sakshi reveals what Mahi is doing during Coronavirus lockdown

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పబ్‌జీ గేమ్‌కు దాసుడైపోయాడని అతని భార్య సాక్షి ధోనీ తెలిపారు. నిద్రలో కూడా పబ్‌జీ గేమ్ గురించే కలవరిస్తున్నాడని ఆమె చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి నెల చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్నీ క్రీడా టోర్నమెంట్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అనేక దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్‌ పునరుద్దరణకు బాటలు పడుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌ సమయంలో క్రీడాకారులందరూ కుటుంబంతో సరదాగా గడిపారు.

పబ్‌జీ గేమ్‌కు దాసుడైపోయాడు:

పబ్‌జీ గేమ్‌కు దాసుడైపోయాడు:

ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో పాల్గొన్న సాక్షి ధోనీకి.. 'లాక్‌డౌన్‌లో ధోనీ ఏం చేస్తున్నారు?' అనే ప్రశ్న ఎదురైంది. నా భర్త పబ్‌జీకి దాసుడైపోయాడు, ఎంతలా అంటే నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడు అని సాక్షి చెప్పారు. 'ధోనీ ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వీడియో గేమ్‌లు ఆడుతున్నప్పుడు మాత్రం ఆ ఆలోచనలు మాత్రం ఉండవు. అది సంతోషకరమే అయినా.. ఈ మధ్య ఆయనకు పబ్‌జీ వ్యసనంగా మారింది. నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడు' అని పేర్కొన్నారు.

అవన్నీ పుకార్లే:

అవన్నీ పుకార్లే:

గత బుధవారం 'ధోనీ రిటైర్స్' అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ ‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాక్షి స్పందించారు. అవన్నీ పుకార్లే అని.. ఈ లాక్‌డౌన్‌ కారణంగా కొందరి మానసిక స్థితి దెబ్బతిన్నది అంటూ సాక్షి ట్వీట్ చేసారు. కొంత సమయం తర్వాత సాక్షి ఆ ట్వీట్‌ని డిలీట్ చేసారు. ఆ మరుసటి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు ధోనీ అభిమానులు 'ధోనీ నెవర్ రిటైర్స్' అనే హ్యాష్‌ట్యాగ్‌ని వైరల్ చేసి.. ధోనీ రిటైర్‌మెంట్‌పై వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు.

ధోనీ పాల్గొంటాడా?:

ధోనీ పాల్గొంటాడా?:

సాక్షి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించనుంది. ఈ లైవ్‌లో సాక్షి ధోనీ క్రికెట్ ప్లాన్స్‌పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే సాక్షి నిర్వహించే ఈ లైవ్ సెషన్‌లో ధోనీ పాల్గొంటాడా.. లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోనీ.. ఐపీఎల్ 2020‌లో పాల్గొనేందుకు మార్చి మొదటి వారంలో చెన్నైకి వచ్చాడు. అక్కడ నిర్వహించిన ప్రాక్టీస్‌లోనూ పాల్గొన్నాడు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో.. ఐపీఎల్ తాత్కాలికంగా రద్దైన విషయం తెలిసిందే.

Story first published: Sunday, May 31, 2020, 20:18 [IST]
Other articles published on May 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+