Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనితో డిన్నర్ డేట్‌కు వెళ్లాలని ఉంది: మనసులో మాట చెప్పిన కైరా

హైదరాబాద్: క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ డేట్ అంటే తనకు ఏంటో తెలియదని, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో డిన్నర్ డేట్‌కు వెళ్లాలని ఉందని తన మనసులోని మాటను చెప్పింది బాలీవుడ్ నటి కైరా అద్వాణి. గతేడాది ధోని జీవితం ఆధారంగా వచ్చిన 'ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో ధోని భార్య సాక్షి పాత్రను కైరా పోషించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెను అభిమాన క్రికెటర్ ఎవరని ప్రశ్నించగా ఇంకెవరూ మహేంద్ర సింగ్ ధోని అంటూ సమాధానమిచ్చింది. అనంతరం క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ డేట్‌కు ఎవరితో వెళ్లాలని ఉంది అని అడగ్గా.. ఆమె ఏమాత్రం తడుముకోకుండా ధోని పేరు వెల్లడించింది.

MS Dhoni is my Hero, I want to date him, says Kiara Advani

'ధోనికి ఇప్పటికే పెళ్లి అయింది. కుటుంబసభ్యుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటాడు. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ డేట్‌ అంటే ఏమిటో నాకు తెలియదు. కానీ, ధోనితో మాత్రం డిన్నర్‌ చేయాలని ఉంది. ధోని చూసేందుకు చాలా సింపుల్‌గా ఉంటాడు. అందుకే నాకు అతనంటే చాలా ఇష్టం. ఇక, విరాట్‌ కోహ్లీ చాలా హాట్‌గా కనిపిస్తాడు' అని చెప్పింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+