Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనికి పట్టిన గ్రహణం వీడిందహో..!!

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు మహేంద్ర సింగ్ ధోనీ దూరంగా ఉండటంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఐకానిక్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగుతోంది. ప్రారంభంలో విఫలమైనా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది చెన్నై సూపర్ కింగ్స్. వరుసగా రెండు మ్యాచ్ లల్లో విజయాలను అందుకుంది. తొలుత ఢిల్లీ కేపిటల్స్, ఆ తర్వాత కోల్ కత నైట్ రైడర్స్ ను మట్టి కరిపించి గాడిన పడింది. అయినప్పటికీ- ఆ జట్టులో పలు లోపాలు లేకపోలేదు.

ఈ పరిణామాల మధ్య మ్యాచ్ ఫలితాల కన్నా ఇప్పుడు ధోనీ ఎప్పుడు తిరిగి వస్తాడనే ప్రశ్నే ప్రధానం. మ్యాచ్ గెలిచినా కూడా తుదిజట్టు ఆయన పేరు లేకపోవడం వెలితిగా అనిపిస్తోంది అభిమానులకు. ఈ అనిశ్చితికి ముఖ్య కారణం ధోనీ ఫిట్‌నెస్ సమస్యలే. కాలి కండరాల ఇబ్బందితో బాధపడుతున్న ఆయన అప్పుడప్పుడు నెట్స్ లో కనిపించినా, పూర్తిస్థాయిలో తిరిగి వచ్చే సమయంపై పెద్దగా స్పష్టత రావట్లేదు.

MS Dhoni is most likely to play his 1st game of this IPL season against Gujarat Titans on April 26

ఇది అభిమానుల్లో ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ ఐపీఎల్ తో ఆయన కేరీర్ చివరి ఘట్టానికి చేరుకుందనే చర్చలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ తెర పడబోతోంది. ఈ నెల 26న గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ లో ధోనీ ఆడటం దాదాపుగా ఖాయమైంది. తొలుత ఈ శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ నాటికి ధోనీ పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధిస్తాడని ఆశించినప్పటికీ అది సాధ్యపడట్లేదు. దీని తర్వాత ఇంకో మ్యాచ్ కు కూడా దూరం అయ్యాడు. 23న వాంఖెడేలో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లోనూ ఆడట్లేదు.

గుజరాత్ టైటాన్స్ తో గేమ్ కు వంద శాతం ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంది. దీనికి తోడు నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తోన్న దృశ్యాలు అతను త్వరలో తిరిగి వస్తాడనే ఆశలను రేకెత్తించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయినా ధోనీ ఆడటం దాదాపుగా ఖాయమైందనుకున్నప్పటికీ.. ఫ్రాంఛైజీ అతని పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. గాయం తిరగబెడితే ఇబ్బందులొస్తాయని, అందుకే ఒకట్రెండు మ్యాచ్ లకు దూరంగా ఉంచడమే బెటర్ అని భావిస్తోంది.

అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితేఈ నెల 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌ కోసం తుదిజట్టు ఎంపిక కోసం అందుబాటులో ఉంటాడని ఆశిస్తోంది మేనేజ్మెంట్. ఆడితే.. ఈ సీజన్ లో అదే తొలి మ్యాచ్ కానుంది ధోనీకి. ఈ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు ధోనీ. సరిగ్గా సీజన్ ప్రారంభం కావడానికి ముందు గాయపడ్డాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌కి అతను తిరిగి వస్తాడని ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు.

Story first published: Friday, April 17, 2026, 11:49 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+