ఇంగ్లీషు రాక ఇబ్బందిపడ్డా: 'ధోని తండ్రి లాంటివాడు'
హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు తండ్రి లాండివాడని పేస్ బౌలర్ మహ్మద్ షమీ అన్నాడు. తన కెరీర్ ఆరంభంలో మద్దతుగా నిలిచిన కెప్టెన్ ధోనీపై షమీ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనితో తన బంధం చాలా ధృడమైందని షమీ పేర్కొన్నాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో షమీ జట్టు సహచరులతో పాటు ధోనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లిష్ రాకపోవడం వల్ల కెరీర్ ఆరంభంలో తాను ఇబ్బందిపడినప్పటికీ జట్టు సహచరులు తనను ఆమోదించారని చెప్పాడు.

ఒత్తిడికి గురయ్యా
'నేను తొలిసారి జట్టుతో చేరడం నాకింకా గుర్తుంది. ఎవరు తొలిసారి భారత జట్టులో చోటు సంపాదించినా ప్రసంగం చేయడమనేది సంప్రదాయం. నేను కాస్త ఒత్తిడికి గురయ్యా. చాలా మంది క్రికెటర్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. నేను అందుకు భిన్నం. నాకు పెద్దగా ఇంగ్లిష్ రాదు. కాబట్టి హిందీలో మాట్లాడతా' అని చెప్పానని అన్నాడు.

హిందీలోనే నన్ను నేను పరిచయం చేసుకున్నా
దీంతో ఆటగాళ్లంతా ‘ఏ భాషలో మాట్లాడితే ఏంటి' అన్నట్లు చూశారు. ఇక హిందీలోనే నన్ను నేను పరిచయం చేసుకున్నాను. వాళ్లు వెంటనే నన్ను అంగీకరించినందుకు చాలా సంతోషంగా అనిపించిందని షమీ చెప్పుకొచ్చాడు. ఇక ధోని విషయానికి వస్తే 'నాకు తండ్రిలాంటి వాడు. ఇంతకన్నా నేనేం చెప్పగలను' అని షమీ వివరించాడు.

రంజీల్లో బెంగాల్ తరుపున ఆడుతున్న షమీ
ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన మహ్మద్ షమీ రంజీల్లో బెంగాల్ తరుపున ఆడుతున్నాడు. స్వదేశంలో 2013లో వెస్టిండీస్‌తో జరిగిన కోల్‌కతా టెస్టులో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ షమీ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు షమీ దూరం
ఇక జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరిస్‌కు కూడా షమీ దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో ఇషాంత్ శర్మకు వన్డే జట్టు ప్రాబబుల్స్‌లో చోటు దక్కే అవకాశం కనబడుతోంది. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఇషాంత్ కు చోటు కల్పించిన బీసీసీఐ సెలక్టర్లు మరొకసారి అతనికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications