Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లాస్‌ ఏంజెల్స్‌లో ధోని అభిమాని: సోషల్ మీడియాలో ఫోటో వైరల్

MS Dhoni is in LA? CSK left surprised over an MS Dhoni number plate found on fans car in Los Angeles

హైదరాబాద్: అభిమానం ఎల్లలు దాటింది. టీమిండియా మాజీకెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నరనే విషయం మరోసారి స్పష్టమైంది. అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌ సిటీలోని ఓ అభిమాని ధోనిపై తనకు ఉన్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎల్లో జెర్సీ ప్రతిబింబించేలా.. తన కారు నంబర్‌ ప్లేట్‌పై ఎంఎస్‌ ధోని అని ఇంగ్లీషులో రాసుకున్నాడు.

‘లాస్‌ ఏంజెల్స్‌లో ధోని అభిమాని’ అనే క్యాప్షన్‌తో

ఇందుకు సంబంధించిన ఫోటోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ తన అధికార ట్విటర్‌లో ‘లాస్‌ ఏంజెల్స్‌లో ధోని అభిమాని' అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దటీజ్‌ తలా! కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌, సూపర్‌ అనే కామెంట్స్‌తో ధోని అభిమానులు సదరు అభిమానిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

మూడో ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న చెన్నై

మూడో ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న చెన్నై

రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ గత ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తిరిగి చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోని ఆ జట్టును టైటిల్ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ఇది చెన్నైకి మూడో ఐపీఎల్ ట్రోఫీ కావడం విశేషం.

 వేలంలో కేవలం ఇద్దరిని మాత్రమే

వేలంలో కేవలం ఇద్దరిని మాత్రమే

గత పదకొండు సీజన్లలో ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2010, 2014, 2018లలో టైటిల్ విజేతగా నిలిచింది. రాబోయే సీజన్ కోసం గత మంగళవారం జరిగిన వేలంలో చెన్నై ముగ్గురు ఆటగాళ్లను వదులుకుని కొత్తగా ఇద్దరిని జట్టులోకి తీసుకుంది. హర్యానాకు చెందిన మీడియం పేసర్‌ అయిన మొహిత్‌ శర్మను రూ.5 కోట్లకు, రంజీ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టిదే

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్, కరణ్ శర్మ, ధ్రువ్ షోరే, డుప్లెసిస్, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, సామ్ బిల్లింగ్స్, మిచెల్ శాంట్నర్, డేవిడ్ విల్లే, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, లుంగి ఎంగిడీ, ఇమ్రాన్ తాహిర్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, ఎన్ జగదీషన్, శార్దుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోయ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మోహిత్ శర్మ (రూ.5 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్‌ (రూ.20 లక్షలు)

Story first published: Saturday, December 22, 2018, 10:20 [IST]
Other articles published on Dec 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+