For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీ20 ప్రపంచకప్‌‌కి ధోనీనే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్.. బ్యాకప్‌గా రాహుల్'

MS Dhoni is Kamran Akmals No. 1 choice wicket-keeper for 2020 T20 World Cup


ఇస్లామాబాద్:
కరోనా వైరస్ మహమ్మారి వల్ల క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను బీసీసీఐ రద్దు చేసింది. గురువారం శ్రీలంక టూర్ రద్దు చేయగా.. శుక్రవారం జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసింది. దీంతో దాదాపా మరో రెండు నెలల వరకు టీమిండియాకు ఎలాంటి సిరీస్ ఆడే అవకాశం లేదు. నేరుగా టీ20 ప్రపంచకప్ లేదా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఆడే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌కి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌ అని పాకిస్థాన్ వెటరన్ కీపర్ కమ్రాన్ అక్మల్ అంటున్నాడు.
 ధోనీపై ఊహించని ప్రశ్న:

ధోనీపై ఊహించని ప్రశ్న:

క్రికెటర్లు అందరూ ఒకవైపు లాక్‌డౌన్‌ సమయాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తూనే.. మరొకవైపు అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నారు. ఖాళీ సమయాల్లో క్రీడాకారులు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లైవ్ చాట్, షోలు నిర్వహిస్తూ పలు విషయ్హాలు అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్ చాట్‌లో పాల్గొన్న పాకిస్థాన్ వెటరన్ కీపర్ కమ్రాన్ అక్మల్‌కు ఎంఎస్ ధోనీపై ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. అయితే అక్మల్ సరైన సమాధానమే చెప్పదనుకోండి.

ధోనీనే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్:

ధోనీనే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్:

ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌గా ఎవరుంటారని మీరు ఊహిస్తున్నారు? అని కమ్రాన్ అక్మల్‌ని ఓ అభిమాని ప్రశ్నించగా.. 'నా అంచనా ప్రకారం ఎంఎస్ ధోనీనే. బ్యాకప్‌గా లోకేష్ రాహుల్ ఉంటే బాగుంటుంది' అని సమాధానం ఇచ్చాడు. ఇప్పటికీ టీమిండియాకి ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ ధోనీనే అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. అక్మల్ పాక్ తరఫున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 11 సెంచరీలు బాదాడు.

రాహుల్ సక్సెస్:

రాహుల్ సక్సెస్:

2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడిన ఎంఎస్ ధోనీ.. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి వరుసగా భారత సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ విఫలమవగా.. రాహుల్ సక్సెస్ అయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో పంత్‌ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. టీ20ల్లో ఓపెనర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న రాహుల్.. కీపర్‌గానూ రాణించడంతో టీ20 ప్రపంచకప్‌లో అతనికే అవకాశమివ్వాలని అందరూ అంటున్నారు. అయితే అక్మల్ మాత్రం ధోనీకే ఓటేశాడు.

డైలమాలో ధోనీ భవిష్యత్తు:

డైలమాలో ధోనీ భవిష్యత్తు:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

వైరల్ వీడియో.. శిల్పాశెట్టితో వార్నర్ టిక్​టాక్!!

Story first published: Saturday, June 13, 2020, 10:24 [IST]
Other articles published on Jun 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+