For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నమ్మకస్తుడు, అందరూ ప్రేమిస్తారు: ధోనీపై రైనా

మిర్పూర్: భారత ఆటగాడు సురేష్ రైనా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరోసారి మద్దతుగా నిలిచాడు. ధోనీ నమ్మకమైన వ్యక్తని, అతడ్ని డ్రెస్సింగ్ రూంలో అందరూ ప్రేమిస్తారని అన్నాడు. అంతేగాక, ఒక్క సిరీస్ ఓటమి అతడ్ని చెడ్డవాడ్ని చేయలేదని చెప్పాడు.

బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు వన్డేలో ఓటమిపాలై మూడు వన్డేల సిరీస్‌ను చేజార్చుకున్న తర్వాత ధోనీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తాను కెప్టెన్ బాధ్యత నుంచి తప్పుకోమంటే.. తప్పుకుంటానని, సాధారణ ఆటగాడిగా కూడా ఆడగలనని ధోనీ స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో పలువురు భారత మాజీ ఆటగాళ్లతోపాటు ప్రస్తుత ఆటగాళ్లు కూడా ధోనీకి మద్దతు ప్రకటించారు. అతను కెప్టెన్‌గా కొనసాగించాల్సిందేనని చెప్పారు. ఇంతకుముందు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఒక వేళ ధోనీ తన ప్రాణాలు అడిగితే.. అప్పటికప్పుడే ఇచ్చేస్తానని చెప్పాడు. ధోనీని గౌరవిస్తామని రైనా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

MS Dhoni is a 'good honest man', everyone loves him in dressing room: Suresh Raina

మూడో వన్డేలో 77 పరుగులతో తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన అనంతరం సురేష్ రైనా మాట్లాడుతూ ధోనీకి తన మద్దతు తెలియజేశాడు. దేశం కోసం ధోనీ ఎంతో చేశాడని, అలాంటి వ్యక్తిని అవమానించొద్దని రైనా స్పష్టం చేశాడు.

'బిసిసిఐ కోసం అతడు(ధోనీ) ఎన్నో ట్రోఫీలను గెలిచాడు. అతడో మంచి నమ్మకమైన వ్యక్తి. ఒక్క సిరీస్ ఓటమి అతడ్ని చెడ్డవాడ్ని చేయలేదు. అతడొక మంచి నాయకుడు. డ్రెస్సింగ్ రూంలో అందరూ అతడ్ని ప్రేమిస్తారు. అతను ఇంకా క్రికెట్‌ కోసం ఎంతో చేయాల్సి ఉంది. అందకే కొంత సమయం వేచిచూడండి' అని సురేష్ రైనా పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+