Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి సిగ్గుండాలి! దమ్ము కొట్టే టైమ్‌లో అయోధ్యకు రాలేడా?

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయిదు దశాబ్దాల నాటి కల సోమవారం సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్యతో పాటు దేశమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అయితే ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు అతిరథ మహారథులు అయోధ్యకు నిన్న తరలి వెళ్లారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.

స్టార్ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, మిథాలీ రాజ్‌, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, వెంకటేశ్ ప్రసాద్‌తో పాటు ఇతర క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్‌ నేషనల్ కోచ్‌ గోపీచంద్‌, ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బాలరాముడిని దర్శించుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

MS Dhoni is being severely criticized for not going to Ayodhya ceremony

మరోవైపు ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం దక్కినప్పటికీ కొందరు క్రికెటర్లు అయోధ్యకు రాలేదు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్ వంటి ప్రముఖులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఎంఎస్ ధోనీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రైవేట్ పార్టీలకు, యాడ్ షూటింగ్‌లకు వెళ్లడానికి ధోనీకి సమయం ఉంటుందని, కానీ చారిత్రక వేడుకకు హాజరు కావడానికి తీరికలేదని ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల ధోనీ ఓ పార్టీలో హుక్కా తాగిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దాన్ని కొందరు గుర్తు చేస్తూ ధోనీ తలుచుకుంటే దమ్ము కొట్టే లోపు అయోధ్యకు రావొచ్చని, ఉద్దేశపూర్వకంగానే రాలేదని నెగటివ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలా ప్రపంచకప్ విజేత గురించి పోటాపోటీగా పోస్ట్‌లు వెల్లువెత్తడంతో ట్విటర్‌లో ధోనీ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

విరాట్ కోహ్లి భార్య అనుష్కను కూడా కొందరు నెటిజన్లు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. కోహ్లి అయోధ్యకు రాకపోవడానికి అనుష్క కారణమంటూ పోస్ట్‌లు పెట్టారు. అయితే వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరమయ్యాడనే విషయం బయటకు రావడంతో అనుష్కను నిందించడం ఆపేశారు. కాగా, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్ కోసం రోహిత్ శర్మ, వ్యక్తిగత విషయాలతో కోహ్లి రాలేకపోవడానికి కారణాలు ఉన్నాయని.. కానీ ధోనీకి ఫ్రీ టైమ్ ఉందని, ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరైతే బాగుండేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై పలికిన 42 ఏళ్ల ధోనీ ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున సత్తాచాటుతున్నాడు. గతేడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నధోనీ నెట్స్‌లో సాధన మొదలుపెట్టాడు.

Story first published: Tuesday, January 23, 2024, 18:04 [IST]
Other articles published on Jan 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+