న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మార్కెట్ గల క్రీడాకారుల జాబితాలో భారత వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ విడుదల చేసిన జాబితాలో ధోనీ టాప్ 10లో నిలిచాడు.
ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులైన క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, కోట్ బ్రియంట్, మరియా షరపోవా, ఆండీ ముర్రే, నెయ్‌మర్ లాంటి ఆటగాళ్లను సైతం వెనక్కునెట్టిన ధోనీ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రస్తుతం ధోనీ ఏడాదికి 4 మిలియన్ డాలర్లను జీతంగా తీసుకుంటుండగా, మరో 27 మిలియన్ డాలర్లను ఇతర ఒప్పందాల ద్వారా పొందుతున్నాడు. కాగా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 78వ స్థానంలో నిలవడం విశేషం.
టెన్నిస్ క్రిడాకారుడు రోజర్ ఫెదరర్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నాడు. కాగా, ఒక ఫోర్బ్స్ మేగజైన్ ఈ ఏడాది విడుదల చేసిన అత్యంత ధనిక క్రీడాకారుల జాబితాలో ధోనీ.. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెన్నిస్ యోధుడు నొవాక్ జకోవిచ్ కంటే కూడా ముందు వరసలో ఉన్నాడు. ఎండార్స్‌మెంట్ల ద్వారా ధోనీ.. ప్రపంచ పాపులర్ ఫుట్ బాలర్ మెస్సీ కంటే ఎక్కువ సంపాదించడం విశేషం.