SRH తో మ్యాచ్ కు ధోనీ ఫిట్- ఇక పక్కకు తప్పుకోండమ్మా
ఐపీఎల్ మ్యాచ్‌లకు మహేంద్ర సింగ్ ధోనీ దూరంగా ఉండటంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఐకానిక్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగుతోంది. ప్రారంభంలో విఫలమైనా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది చెన్నై సూపర్ కింగ్స్. వరుసగా రెండు మ్యాచ్ లల్లో విజయాలను అందుకుంది. తొలుత ఢిల్లీ కేపిటల్స్, ఆ తర్వాత కోల్ కత నైట్ రైడర్స్ ను మట్టి కరిపించి గాడిన పడింది. అయినప్పటికీ- ఆ జట్టులో పలు లోపాలు లేకపోలేదు.
ఈ పరిణామాల మధ్య మ్యాచ్ ఫలితాల కన్నా ఇప్పుడు ధోనీ ఎప్పుడు తిరిగి వస్తాడనే ప్రశ్నే ప్రధానం. మ్యాచ్ గెలిచినా కూడా తుదిజట్టు ఆయన పేరు లేకపోవడం వెలితిగా అనిపిస్తోంది అభిమానులకు. ఈ అనిశ్చితికి ముఖ్య కారణం ధోనీ ఫిట్‌నెస్ సమస్యలే. కాలి కండరాల ఇబ్బందితో బాధపడుతున్న ఆయన అప్పుడప్పుడు నెట్స్ లో కనిపించినా, పూర్తిస్థాయిలో తిరిగి వచ్చే సమయంపై పెద్దగా స్పష్టత రావట్లేదు.

ఇది అభిమానుల్లో ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ ఐపీఎల్ తో ఆయన కేరీర్ చివరి ఘట్టానికి చేరుకుందనే చర్చలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ తెర పడబోతోంది ఇంకో రెండు రోజుల్లో. ఈ నెల 18వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ధోనీ ఆడటం దాదాపుగా ఖరారైనట్టే. పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించడానికి ఇంచిల దూరంలో ఉన్నాడీ మాజీ కేప్టెన్. 90 శాతం ఫిట్ నెస్ నమోదు చేసినట్లు ఫ్రాంఛైజీ చెబుతోంది.
దీనికి తోడు నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తోన్న దృశ్యాలు అతను త్వరలో తిరిగి వస్తాడనే ఆశలను రేకెత్తించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయినా ధోనీ ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితేఈ నెల 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్ కోసం తుదిజట్టు ఎంపిక కోసం అందుబాటులో ఉంటాడని ఆశిస్తోంది మేనేజ్మెంట్. ఆడితే.. ఈ సీజన్ లో అదే తొలి మ్యాచ్ కానుంది ధోనీకి.
ఈ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ధోనీ. సరిగ్గా సీజన్ ప్రారంభం కావడానికి ముందు గాయపడ్డాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌కి అతను తిరిగి వస్తాడని ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ధోనీతో పాటు ప్రారంభ మ్యాచ్ లకు దూరమైన డెవాల్డ్ బ్రేవిస్ సైతం జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మ్యాచ్ ఆడుతున్నాడు కూడా. నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడీ సౌతాఫ్రికన్ స్టార్ బ్యాటర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications